Devara: ‘దేవర’పై ‘ఆచార్య’ షేడ్స్.. ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్

Devara: ‘దేవర’పై ‘ఆచార్య’ షేడ్స్.. ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత తారక్ రేంజ్ మారిపోయింది. ఇక ఇప్పుడు చేయబోతున్న సినిమాకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ప్రస్తుతం తారక్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘దేవర’(Devara) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఇచ్చారు. ఇక ఈ సినిమా మాటేమో కానీ ఎన్టీఆర్‌ను నిత్యం ఒక భయం అయితే తొలిచి వేస్తోంది.

కొరటాలకు ఆచార్య(Achrya) మూవీకి ముందు వరకూ సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరుంది. కానీ ఆచార్య డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంది. ఇటీవల ఇటీవలే ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈ సినిమా టైటిల్ తో పాటు ఎన్టీఆర్(Jr NTR) లుక్ ను రిలీజ్ చేశారు. టైటిల్‌లో ఉన్నంత పవర్ పోస్టర్‌లో లేదనే కామెంట్స్ వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు.

తాజాగా మరోసారి ఒక విషయం ఎన్టీఆర్ అభిమానులను ఆందోళనలోకి నెట్టివేసింది. తాజాగా దేవర చిత్రం కోసం చిత్ర యూనిట్ ఒక దేవాలయానికి సంబంధించిన భారీ సెట్‌ను వేస్తోంది. టెంపుల్ సెట్ అనేసరికి సినిమాపై ఆచార్య(Acharya) వైబ్స్ ఏమైనా కనబడుతున్నాయా? అనే టెన్షన్ ఫ్యాన్స్‌లో ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే ఈ ఫోటోలు మరింత వైరల్ అవ్వకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!