Rana Daggubati: రాక్షస రాజుగా రానా.. బంపర్ ఆఫర్ ఇచ్చిన తేజ

Rana Daggubati: రాక్షస రాజుగా రానా.. బంపర్ ఆఫర్ ఇచ్చిన తేజ

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దగ్గుబాటి రానా, దర్శకుడు తేజల కాంబోలో మరో మూవీ తెరకెక్కనుంది. గోపీనాథ్ ఆచంట నిర్మాతగా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. ఈ సినిమాలో ఒక ప్రముఖ మలయాళం స్టార్ కూడా నటించబోతున్నట్టు సమాచారం.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా నేపథ్యంలో చాలా మంది కొత్త వాళ్లను తేజ పరిచయం చేయబోతున్నట్టు సమాచారం.

Rana Daggubati: రాక్షస రాజుగా రానా.. బంపర్ ఆఫర్ ఇచ్చిన తేజ

ఇక రానా, తేజ కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి రాక్షస రాజుఅనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తేజ స్వయంగా వెల్లడించారు. రానాతో సినిమా చేయబోతున్నానని.. దీనికి రాక్షస రాజు అనే టైటిల్‌ అనుకుంటున్నట్టు తేజ తెలిపారు.

ఆసక్తికరంగా ఈ సినిమాలో 45 మంది కొత్త వాళ్లను పరిచయం చేయబోతున్నట్టు వెల్లడించారు. మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. తన సినిమాలో నటించాలనే ఆసక్తి ఉన్న వాళ్లు తనను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వాలని.. పూర్తి వివరాలు అక్కడ పెడతానని తేజ వెల్లడించారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!