బ్రా విప్పేందుకు ఆడవాళ్ల క్యూ.. ఆ ఫెన్సింగ్ చేస్తున్న మాయేంటో తెలిస్తే..

బ్రా విప్పేందుకు ఆడవాళ్ల క్యూ.. ఆ ఫెన్సింగ్ చేస్తున్న మాయేంటో తెలిస్తే..

కొన్ని వినడానికి వింతగా ఉంటే.. కొన్ని చూడటానికి వింతగా ఉంటాయి. కొన్ని నమ్మకాలు చిత్రంగా అనిపిస్తాయి. కొన్ని ఆచారాలు అచ్చెరువొందేలా చేస్తాయి. ఇలాంటి ఆచారం కూడా ఒకటి ఉంటుందా? అని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. ఇలాంటి ఆచారమే ఒక న్యూజిలాండ్‌లో సెంట్రల్ ఒటాగోలో కార్డోనా ప్రాంతంలో కనిపిస్తుంది. అక్కడి ప్రజలు చేస్తున్న పని చూస్తే షాక్ అవుతారు. ఇలాంటి ఆచారం ఒకటి ఉందా? పైగా దీని వల్ల మంచెలా జరుగుతుంది? అని అనిపించక మానదు.

ఇంతకీ ఆ వింత ఆచారమేంటి? అంటారా? ఓ ప్రదేశంలోకి వెళ్లగానే ఒక ఫెన్సింగ్ ఉంటుంది. అక్కడకు వెళ్లగానే మహిళలు బ్రా తీసేసి ఓ తీగపై వేలాడదీసి ఓ కోరిక కోరుకుంటారట. అది తప్పక నెరవేరుతుందని వారి నమ్మకం. న్యూజిలాండ్‌లో సెంట్రల్ ఒటాగోలో కార్డోనా ప్రాంతంలో జరుగుతోంది. మరి బ్యాగులో పెట్టుకుని తీసుకొచ్చి కూడా వేలాడదీయవచ్చు కదా అంటారా? అలా చేయకూడదట. కంచె ఎదురుగా ఉండి ఒంటిపై ఉన్న బ్రా తీసి ఫెన్సింగ్‌పై వేసి మనసులో కోరిక చెప్పేసి వెళ్లిపోతారు.

Advertisement
బ్రా విప్పేందుకు ఆడవాళ్ల క్యూ.. ఆ ఫెన్సింగ్ చేస్తున్న మాయేంటో తెలిస్తే..

అక్కడ ఉన్న వారే కాదండోయ్.. పర్యాటకులు కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలా చేస్తే కోరుకున్న ప్రియుడితో పక్కాగా పెళ్లి జరుగుతుందట. లేదంటే మంచి వ్యక్తితో వివాహం జరిగి జీవితాంతం సంతోషంగా గడుపుతారట. 1999లో నాలుగు బ్రాలను ఎవరో వేలాడదీసి వెళ్లిపోయారట. అది ఎవరనేది ఎవరికీ తెలియదు కానీ అప్పటి నుంచి బ్రాలను వదిలేసి వెళ్లడం సంప్రదాయంగా మారిపోయింది. ఇప్పడైతే బ్రాలతో ఫెన్సింగ్ నిండిపోతోందట. నిజానికి బ్రాలతో నిండిన ఆ ఫెన్సింగ్ చూస్తే షాకింగ్‌గా అనిపిస్తుంది.