Chandrabose: ఆస్కార్ స్టేజ్‌పై చంద్రబోస్ ఎందుకు మాట్లాడలేదు? జక్కన్న వార్నింగ్ ఇచ్చారా?
కోట్లాదిమంది ఇండియన్స్ ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు (Oscar Award) లభించింది. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమాకు ఆస్కార్ అవార్డు లభించింది. దక్షిణాది మొత్తం ఈ విషయంలో ఆనందించింది. సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు పంచుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఆ తర్వాత మొదలైంది అసలు కథ.
అసలు కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడన్న రీతిలో ఒక్కొక్క క్వశ్చన్ ఉత్పన్నమవుతోంది. తాజాగా ఒక ప్రశ్న నెటిజన్లను వేధిస్తోంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani) పాట రూపంలో స్పీచ్ ఇచ్చారు. కానీ ఆయనతో పాటు స్టేజ్‌పై ఉన్న లిరిక్ రైటర్ చంద్రబోస్ (Lyric writer Chandrabose) మాత్రం పెదవి విప్పలేదు. వెళుతూ మాత్రం లాస్ట్‌లో నమస్తే అని చాలా క్యాజువల్‌గా చెప్పారు. ఇప్పుడు నెటిజన్లను వేధిస్తోన్న క్వశ్చన్ ఏంటంటే.. ఎందుకు చంద్రబోస్ (Chandrabose)మాట్లాడలేదు?
ఆయనకు ఇంగ్లీష్ బాగా మాట్లాడటం రాదని అందుకే మాట్లాడలేదని కొందరు బావించారు. అయితే చంద్రబోస్ (Chandrabose) ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతారు. మరికొందరు దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli) ఆయనను పెదవి విప్పడానికి వీల్లేదంటూ వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. వార్నింగ్ ఇచ్చేవారే అయితే చంద్రబోస్‌ను స్టేజ్‌పైకి పంపేవారే కాదు కదా. అసలు కారణం ఏంటంటే.. ఆస్కార్ అకాడమీ రూల్ ప్రకారం అవార్డు అందుకున్న ఎవరైనా సరే 45 సెకండ్లకు మించి స్టేజిపై మాట్లాడకూడదు. అది రూల్. ఎవరైనా పాటించాల్సిందే. ఆ రూల్ ప్రకారమే చంద్రబోస్ మాట్లాడలేదట. కీరవాణి (MM Keeravani) ఒక్కరు పాట ద్వారా తన సందేశం అందజేశారు.