Dasara Review : దసరా మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. టాక్ ఏంటంటే..

Dasara Movie Review

దసరా (Dasara) సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపైనే హీరో నాని తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో నాని చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలనే ఉద్దేశంతో ప్రచారాన్ని పీక్స్‌లో నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా దసరా (Dasara Movie) తెరకెక్కడంతో దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్‌లు సినిమాకు ప్రచారం కల్పిస్తున్నారు.

దసరా హిట్ అయితే నాని రేంజే మారిపోతుంది. పాన్ ఇండియా హీరో ట్యాగ్‌తో ఈసారి రెమ్యూనరేషన్‌ను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా నానికి ఇతర పరిశ్రమల్లో మార్కెట్ పెరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కావొచ్చు నాని ప్రచారాన్ని పీక్స్‌కు తీసుకెళుతున్నాడు. కాగా.. దసరా మూవీ ఫస్ట్ రివ్యూ (Dasara First Review) వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు దసరా మూవీ రివ్యూ ఇచ్చేశారు. ఎప్పటిలాగే ఆయన ట్విట్టర్ వేదికగా షార్ట్ రివ్యూ ఇచ్చారు.

Dasara Movie Review

దసరా మూవీ (Dasara Movie)కి రేటింగ్ కూడా ఉమైర్ సంధు ఇచ్చేశారు. దసరా పక్కా కమర్షియల్ మూవీ అని.. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుందని తెలిపారు. హీరో నాని (Nani) వన్ మ్యాన్ షో చేశాడని కితాబిచ్చారు. నానిది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ అని ప్రశంసలు గుప్పించారు. ఇక కీర్తి సురేష్(Keerthy Suresh) గురించి చెప్పాలంటే ఆమె బాంబులా పేలారని… యాక్షన్ సన్నివేశాలైతే సినిమాకే హైలెట్‌గా నిలిచాయని తెలిపారు. దసరా మూవీకి ఉమైర్ సంధు 3.5/5 రేటింగ్ ఇచ్చారు. ఫ్యాన్స్‌కి అయితే ఈ రివ్యూతో ఫుల్ జోష్ వచ్చేసింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!