Mahesh Babu shirt: మహేష్ బాబు షర్ట్ కాస్ట్ వింటే షాక్ అవుతారు..!

Mahesh Babu shirt cost

సెలబ్రిటీలు ఏం చేసినా అది హాట్ టాపిక్కే. ముఖ్యంగా వారి డ్రెస్, వాచీలు, గాడ్జెట్స్ ఏం ధరిస్తున్నారు? వాటి ధర ఎంత అనేది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది సామాన్య జనానికి. ఇక రెమ్యూనరేషన్ దగ్గర నుంచి చెప్పుల వరకూ చర్చనీయాంశమే. సోషల్ మీడియా బాగా అందుబాటులోకి రావడంతో తమ అభిమాన హీరో కనిపిస్తే చాలు ఆయన్ను టాప్ టు బోటమ్ పరిశీలిస్తారు. వెంటనే షర్ట్ బాగా అనిపిస్తే వెంటనే కాస్ట్ కోసం వెదుకుతారు. అలాగే వాచ్.. చివరకు చెప్పులు కూడా.

టాప్ హీరోల సినిమాలోని మ్యానరిజమ్స్ ని మాత్రమే కాదు వారు వేసుకున్న కాస్ట్యూమ్స్.. చివరకు హెయిర్ స్టైల్‌ను కూడా బాగా ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) వేసుకున్న షర్ట్ (Mahesh Babu Shirt) ఫ్యాన్స్‌ని తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. తాజాగా మహేష్ బాబు – త్రివిక్రమ్‌ (Trivikram Srinivas)ల మూవీ పోస్టర్ ఒకటి విడుదలైన విషయం తెలిసిందే. నిజానికి ఆ పోస్టర్‌ను రిలీజ్ డేట్ వెల్లడించేందుకు చిత్ర యూనిట్ విడుదల చేసింది. కానీ ఫ్యాన్స్ (Mahesh Babu fans) మాత్రం రిలీజ్ డేట్‌ను పక్కనబెట్టేసి మిగిలిన విషయాలపై ఫోకస్ చేశారు.

Mahesh Babu shirt cost

మహేష్ (Mahesh Babu) బీడి కాలుస్తూ వస్తున్నాడు ఆ పోస్టర్‌లో. మహేష్ స్మోక్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయని.. దీనికి ఒక్కడు, పోకిరీ సినిమాలే నిదర్శనమని.. కాబట్టి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ లెక్కలేసి మరీ ఖుషీ అయిపోతున్నారు. ఇక దీని తర్వాత మహేష్ వేసుకున్న షర్ట్‌పై చాలా మంది ఫోకస్ పెట్టారు. అది ఫ్యాన్స్‌ని బీభత్సంగా ఎట్రాక్ట్ చేస్తోంది. దీని కాస్ట్ తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే దాని ధర కేవలం రూ.3,299 మాత్రమే. ప్రస్తుతం ఇది అజియో‌లో అందుబాటులో ఉంది. దీనిని పక్కనబెడితే ఆ ధర మనలాంటి సామాన్యులకైతే ఎక్కువే కానీ మహేష్‌కి అది నథింగ్. నిజానికి ఓ పెద్ద ధర ఉంటుందని నెటిజన్లు భావించారు. కానీ రూ.3,299 అనగానే షాక్ అయ్యారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!