Hariteja: హరితేజ లేటెస్ట్ పిక్ చూశారా? వెల్లువెత్తుతున్న కామెంట్స్

Hariteja latest pic

హరితేజ (Hariteja).. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడైతే అసలు వెండితెర, బుల్లితెరలపై కనిపించడమే మానేసింది. చాలా టాలెంట్ ఉంది కానీ అవకాశాలు మాత్రం కలిసి రావడం లేదు. వెండితెరపై సక్సెస్ లేదనుకున్నా కనీసం బుల్లితెరపై నటిస్తున్నారు చాలా మంది నటీనటులు. కానీ హరి తేజకు ఎందుకో గానీ బుల్లితెరపై కూడా అవకాశాలు కలిసి రావడం లేదు. కెరీర్ మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేసి మెప్పించేందుకు యత్నించింది. కానీ ఫలితం శూన్యం.

Hariteja latest pic

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, విలేజ్‌లో వినాయకుడు, అందరి బంధువయ్య తదితర సినిమాలు చేసినప్పటికీ.. తివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas దర్శకత్వంలో సమంత(Samantha), నితిన్(Nithiin) హీరో హీరోయిన్లుగా నటించిన ‘అ ఆ’ సినిమానే ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పటి వరకూ హరితేజ (Hariteja) అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఈ సినిమాలో మంగమ్మ అనే క్యారెక్టర్‌లో ఆమె జీవించింది. ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసింది. దీంతో ఇక హరితేజ కెరీర్ గాడిన పడ్డట్టే.. ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతాయని అంతా భావించారు. కానీ అదేం జరగలేదు.

Hariteja latest pic

2017లో వచ్చిన బిగ్ బాస్ 1 (BiggBoss1)లో పాల్గొని అలరించింది. అది కూడా ఆమెకు కలిసి రాలేదు. ఇక ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చి బొద్దుగా తయారైంది. తాజాగా తన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నెటిజన్లు షాక్ అయ్యారు. సన్నగా అయిపోయింది. ఇక దీనిపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. బొద్దుగా ఉంటేనే బాగుంటారని కొందరు.. మీ వెయిట్ లాస్ జర్నీ చెప్పమంటూ మరికొందరు.. మీ చార్మ్ కోల్పోయారని ఇంకొందరు ఇలా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి హరితేజ (Hariteja) కాస్త బొద్దుగా ఉంటేనే బాగుంటుంది. మరీ సన్నగా అయిపోయి నిజంగానే చార్మ్ కోల్పోయినట్టుగా కనిపిస్తోంది.

Hariteja latest pic
Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!