Adipurush Poster: ఇదేందయ్యా.. ఇది..‘ఆదిపురుష్’ పోస్టర్ రిలీజ్.. ప్రభాస్‌ను చూస్తుంటే..!

Adipurush Latest Poster

ప్రభాస్ (Prabhas) అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). బాలీవుడ్ యువ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఆది నుంచే ఈ సినిమాపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon) నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ నడుస్తోంది.

ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదల కానుంది. కాగా.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌పై ట్రోలింగ్ బీభత్సంగా జరిగింది. యానిమేటెడ్ మూవీలా ఉందని.. వానరుల నుంచి లంకేష్‌గా నటించిన సైఫ్ లుక్ వరకూ ట్రోలింగ్స్‌ను ఎదుర్కొంది. ఇక అంతా కూడా ఈ చిత్ర యూనిట్ శ్రీరామనవమి (Sri Ramanavami) పర్వదినం సందర్భంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తుందని భావించింది. అనుకున్నట్టుగానే నేడు చిత్ర యూనిట్ ‘ఆది పురుష్’ నుంచి ఓ పోస్టర్‌ (Adipurush Poster)ని విడుదల చేసింది.

Adipurush Latest Poster

చిత్ర పోస్టర్‌ను సీత, రాముడు, లక్ష్మణుడు నిలుచుని ఉండగా.. హనుమంతుడు మొక్కుతున్నట్టుగా డిజైన్ చేశారు. దానికి ‘మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చాడు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో ఈ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ లుక్ చూస్తుంటే కృష్ణంరాజును చూస్తున్నట్టే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. పోస్టర్‌కి ఫిల్టర్స్ అద్దితే ఎలా ఉంటుందో అలా ఉంది. నీల మేఘ శ్యాముడు కనిపించడం లేదంటూ కొందరు విమర్శిస్తున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!