Naga Chaitanya – Shobita Dhulipala: నాగచైతన్యతో డేటింగ్‌లో శోభితా దూళిపాళ్ల.. ఇదిగో ప్రూఫ్..!

Naga Chaitanya and Shobita Dhulipala

హీరో నాగచైతన్య, సమంత రీల్ లైఫ్ బంధాన్ని రియల్ లైఫ్ బంధంగా మలుచుకున్నారు. ఎందుకోగానీ వీరి కాపురం ముణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడిపోతున్నారన్న వార్త తెలిసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. వీరి బ్రేకప్ కారణాలేంటనేది మాత్రం బయటి ప్రపంచానికి నేటికి తెలియదు. ఏవేవో ఊహాగానాలు ఎవరికి తెలిసింది వారు అనుకుని ఊరుకున్నారు. మొత్తానికి వీరిద్దరూ విడిపోయి ఎవరి బతుకు వారు బతుకుతున్నారు.

ఇక ఇటీవలి కాలంలో నాగచైతన్య గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చైతు, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల డేటింగ్‌లో ఉన్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. చైతు ఇంట్లో శోభిత కనిపించడంతో ఈ డేటింగ్ వార్తలు ప్రారంభమయ్యాయి. ఇక తాజాగా ఈ డేటింగ్ వార్తలకు బలం చేకూరేలా ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Naga Chaitanya and Shobita Dhulipala

లండన్‌లో నాగ చైతన్య డిన్నర్‌కు వెళ్లాడు. జమావర్‌లో డిన్నర్ డేట్‌ చేశాడు. అయితే అక్కడి చెఫ్ సురేందర్‌ మోహన్‌..చైతును చూడగానే ఆయనతో ఫోటోను తీసుకున్నాడు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీరిద్దరి వెనుక శోభిత కనిపిస్తోంది. గుర్తు పట్టేసిన నెటిజన్లు వీరిద్దరూ లండన్ వెకేషన్‌లో ఉన్నారంటూ.. వీరిద్దరి డేటింగ్ వార్తలకు ఇదే ప్రూఫ్ అంటూ ప్రచారం ప్రారంభించారు. మరి ఇప్పటికైనా వీరిద్దరిలో ఒకరైనా తమ రిలేషన్‌పై స్పందిస్తారో లేదో చూడాలి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!