Honey Rose: హనీరోజ్.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందట..

Honey Rose to marry soon

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఎంత కాలం క్రితం ఇచ్చారనేది కాదు.. గుర్తింపు ఎప్పుడు వచ్చిందనేది ముఖ్యం. కొందరికి ఎంత కాలం ఉన్నా గుర్తింపు రాదు. మరికొందరికి మాత్రం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పెట్టగానే సంచలనం సృష్టించేస్తారు. మరికొందరికి మాత్రం కొన్నేళ్లు పడుతుంది. ఈ కోవకు చెందిందే హనీ రోజ్ (Honey Rose). అమ్మడు 2005లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ అమ్మడికి సరైన గుర్తింపు అనేది రాలేదు. ఇన్నాళ్లకు ఈ ముద్దుగుమ్మకు టైం వచ్చింది. బాలయ్య సినిమాతో ఫేమస్ అయిపోయింది.

Actress Honey Rose

తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో హనీరోజ్(Honey Rose) తెగ ఫేమస్ అయిపోయింది. సోషల్ మీడియాలోనూ ఫొటోలు, వీడియోలతో రచ్చ లేపుతోంది. అమ్మడి హవా ఈ రేంజ్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుంటోందంటూ ప్రచారం ప్రారంభమైంది. హీరోయిన్స్.. కెరీర్ గాడిన పడాలని ఎంతగానో ఎదురు చూస్తారు. అది అద్భుతంగా నడుస్తోందంటే ఇక పెళ్లి ప్రస్తావనే దరి చేరనివ్వరు కానీ ఇప్పుడు హనీ (Honey Rose).. తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఈమె ఏం చెప్పింది?

Honey Rose with Balakrishna

కేరళ కుట్టి అయిన హనీ.. రీసెంట్‌గా బాలయ్య (Balakrishna) ప్రధాన పాత్రలో రూపొందిన ‘వీరసింహారెడ్డి’లో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో అమ్మడికి అంతులేని ఫేమ్ వచ్చేసింది. ఇక ఇప్పుడు ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నా హనీయే(Honey Rose). పాప బాగా బిజీ అయిపోయింది. తాజాగా విజయవాడలో ఓ బేకరీ ఓపెనింగ్ కు వచ్చిన హనీరోజ్.. తన పెళ్లి గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లి అనేది పెద్ద బాధ్యత అని.. దానికి తాను రెడీగా ఉన్నట్టు వెల్లడించింది. పెళ్లి బంధం బలంగా ఉండటానికి తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని తెలిపింది. ఇంకేముంది? అమ్మడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!