Rakesh Sujatha: రాకేష్- సుజాతల పెళ్లై నెల కూడా కాలేదు.. ఇంతలోనే ఏమైంది?

Rakesh Sujatha2

తెలుగు తెరపై కడుపుబ్బా నవ్వించే కామెడీ షో జబర్దస్త్. ఎన్ని షోలు వచ్చినా జబర్దస్త్ (Jabardasth) క్రేజ్ మాత్రం తగ్గలేదు. రేటింగ్ కూడా తగ్గడం లేదు. దీనిలో వల్గారిటీ కాస్తంత ఎక్కువైందంటూ విమర్శలు వినవస్తున్నా కూడా షోకి ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఇక దానిలోని కమెడియన్స్‌కి అయితే ఫుల్ క్రేజ్. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ తమ టాలెంట్‌ను ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. వెండితెరపై కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ కోవకు చెందినవాడే రాకింగ్ రాకేష్ (Rocking Rakesh).

తొలుత చిన్న పిల్లలతో షోను ప్రారంభించిన రాకింగ్ రాకేష్ (Rocking Rakesh).. ఆ తర్వాత పెద్ద వాళ్లతో కూడా షోలు చేశాడు. అతనితో పాటు స్కిట్ చేసిన వారిలో ఒకరు జోర్దార్ సుజాత (Jordar Sujatha). వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారి.. ఇటీవలే పెళ్లి పీటలు కూడా ఎక్కేశారు. ఇక సోషల్ మీడియాలో ఈ జంట యమా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఓ స్కిట్ లో భాగంగా సుజాతపై రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీశాయి. నిజానికి రాకేష్ (Rakesh) ఏ ఉద్దేశంతో చేశాడో కానీ తెగ వైరల్ అవుతున్నాయి.

Rakesh Sujatha

ఆమెను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నావా అని యాంకర్ ప్రశ్నించగా.. తమది పవిత్రమైన ప్రేమ అని వెల్లడించాడు. అంతటితో ఆగితే బాగానే ఉండేది. వెంటనే.. ‘బొంగులో లవ్ అండీ.. బొంగులో లవ్.. ప్రేమించేదాక.. పెళ్లి చేసుకునేదాక టార్చర్ పెట్టింది’ అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాకేష్ ఫన్ కోసమైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం వీరిద్దరికీ ఏమైందంటూ విస్తుబోతున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!