Pooja Hegde: ఫ్లాప్‌ల విషయంలో హ్యాట్రిక్స్ కొడుతున్న పూజా హెగ్డే.. ఇక ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యిందో…

Pooja Hegde

ఫ్లాఫ్‌ల విషయంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) హ్యాట్రిక్‌ల మీద హ్యాట్రిక్‌లు ఇస్తోంది. అమ్మడికి ఎందుకోగానీ ఇటీవలి కాలంలో బీభత్సంగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వరుసగా ఆరో ఫ్లాప్ కూడా అమ్మడి ఖాతాలో పడిపోయింది. రాధే శ్యామ్(Radhe Shyam) మొదలు నేటి కిసీ కా భాయ్ కిసీ కీ జాన్(Kisi Ka Bhai Kisi Ka Jaan) వరకూ అమ్మడు నటించిన సినిమాలన్నీ ఫ్లాపే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా తర్వాత అమ్మడు హిట్ కొట్టిన పాపాన పోలేదు. దీంతో అమ్మడి కెరీర్‌కి శుభం కార్డు పడినట్టేనని టాక్ నడుస్తోంది.

రాధేశ్యామ్, ఆచార్య(Acharya), బీస్ట్(Beast), సర్కస్(Cirkus), ఎఫ్3(F3) మూవీలో ఐటెం నంబర్ వరకూ మొత్తం గోవిందా. ఇక కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌(Kisi Ka Bhai Kisi Ki Jaan)తో అయినా హిట్ కొట్టాలని అమ్మడు తెగ కష్ట పడింది. కానీ ఫలితంలో మాత్రం మార్పేమీ రాలేదు. అమ్మడు చేసిన ఆరు సినిమాలు స్టార్ హీరోలవే కావడం విశేషం. అయినా కూడా గోల్డెన్ కాస్తా రివర్స్ అయినట్టుంది. ఇక చాలా కష్టపడి చేసిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ అయితే డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. తొలి షో నుంచే ఇది నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది.

Pooja Hegde in Kisi Ka Bhai Kisi Ki Jaan movie

రంజాన్ పండుగ అయినా తనకు హిట్‌ను అందిస్తుందేమోనని పూజా తెగ ఆశ పడింది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా ఎక్కడా కూడా వెనుకడుగు వేయలేదు. అయినా కూడా ఓపెనింగ్స్ దక్కలేదు. ఇక అమ్మడిని తీసుకునేందుకు దర్శకులెవరూ ముందుకు రావడం లేదట. ఈ ముద్దుగుమ్మను ఫిక్స్ చేసుకున్న వారు సైతం క్యాన్సిల్ చేసుకుని వేరొక హీరోయిన్ వైపు వెళుతున్నారని టాక్.

హరీష్ శంకర్(Harsish Shankar) మూవీలో పవన్‌కి జంటగా పూజా హెగ్డే(Pooja Hegde)ను అనుకుని ఆ తర్వాత మనసు మార్చుకొని శ్రీలీల(Sreeleela)ను తీసుకున్నారు. ఇక ఇప్పుడు పూజా(Pooja Hegde) తన ఆశలన్నీ ఎస్ఎస్ఎంబీ 28పైనే పెట్టుకుంది. ఇది కానీ ఫ్లాప్ అయ్యిందో.. అమ్మడి కెరీర్ అస్సామేనని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!