Chitti Babu: నేను కౌంటర్ ఇస్తే..: సమంతకు చిట్టిబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Chitti Babu: నేను కౌంటర్ ఇస్తే..: సమంతకు చిట్టిబాబు స్ట్రాంగ్ వార్నింగ్

స్టార్ హీరోయిన్ సమంత(Samantha), నిర్మాత చిట్టిబాబు(Chitti Babu)ల మధ్య వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. తొలుత చిట్టిబాబు ‘శాకుంతలం’(Shaakuntalam) మూవీ ఫ్లాప్‌కు పూర్తిగా సమంతను బాధ్యురాలిని చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆపై సమంత లేటుగా అయినా లేటెస్ట్‌గా స్పందించింది.

తాజాగా సమంత కౌంటర్‌పై చిట్టిబాబు తాను కూడా ఆమె పేరు ప్రస్తావించనంటూనే ప్రస్తావిస్తూ మరోసారి విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఇద్దరూ కలిసి మీడియాకు కావల్సినంత స్టఫ్ ఇస్తున్నారు.

చిట్టిబాబు(Chitti Babu)కు సమంత పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. చెవుల్లో వెంట్రుకలు ఎక్కువగా టెస్టోస్టిరాన్ ఎక్కువైతే పెరుగుతాయంటూ సెటైర్ వేసింది. చెవుల్లో వెంట్రుకలు ఎక్కువగా ఉండేది చిట్టిబాబుకే కాబట్టి కౌంటర్ ఆయనకేనంటూ సోషల్ మీడియాతో పాటు.. మెయిన్ స్ట్రీమ్ మీడియా గగ్గోలు పెట్టింది.

పైగా అంతకు ముందు శాకుంతలం మూవీ ఫ్లాఫ్ అవడానికి సమంతే(Samantha) కారణమంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చివరకు సమంత అనారోగ్యంపై కూడా విమర్శలు గుప్పించారు. దీంతో సామ్ కౌంటర్ ఇచ్చిందంటూ వార్తలొచ్చాయి.

ఇక తాజాగా సామ్(Samantha) వ్యాఖ్యలపై స్పందించిన చిట్టిబాబు.. కొందరు తెలివిగా మాట్లాడుతున్నారు అనుకుంటారని.. కానీ తాను కౌంటర్ ఇస్తే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆమె తన పేరు చెప్పలేదని.. తాను కూడా సమంత పేరు చెప్పనన్నారు. తన వెంట్రుకల గురించి కంటే.. తాను చెప్పే నిజాల గురించి స్పందిస్తే బాగుండేదన్నారు. తాను కౌంటర్ ఇస్తే మాత్రం సమాధానం చెప్పడం చాలా కష్టమన్నారు. మరి చిట్టిబాబు వ్యాఖ్యలపై తిరిగి సమంత స్పందిస్తుందో.. సైలెంట్ అవుతుందో వేచి చూడాలి.

థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!