Sai Dharam Tej: సాయి ధరమ్.. ఫర్హాన్.. ఈ ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం ?

Sai Dharam Tej and Abdul Farhan

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌(Sai Dharam Tej)కు 2021 ఎండింగ్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆయన బైక్ అదుపు తప్పడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆయనను సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్(Abdul Farhan) అనే వ్యక్తి కాపాడి హాస్పిటల్‌కి తరలించాడు. మొత్తానికి సాయిధరమ్ కోలుకున్నాడు.

తాజాగా ఆయన నటించిన విరూపాక్ష(Virupaksha) చిత్రం కూడా విడుదలైంది. మంచి సక్సెస్ సాధించింది. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ సమయంలో సాయి ధరమ్(Sai Dharam Tej) తనను కాపాడిన ఫర్హాన్ గురించి మాట్లాడాడు.

ఫర్హాన్‌(Abdul Farhan)కు తాను సాయమైతే ఏమీ చేయలేదు కానీ తనకు ఫోన్ నంబర్ ఇచ్చానని.. ఏదైనా సాయం కావాలంటే వెంటనే వచ్చి తనను కలవాలని చెప్పాడు. ఏదో ఒక లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకోవాలని అనుకోవడం లేదని వెల్లడించాడు.

సీన్ కట్ చేస్తే.. అంతకు ముందు ఫర్హాన్‌కు సాయి ధరమ్ లక్ష రూపాయలు ఇచ్చాడంటూ పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అయ్యింది. ఈ న్యూస్ తనకు చాలా ఇబ్బందులు తెచ్చి పెట్టిందని ఫర్హాన్ తెలిపాడు. సాయి ధరమ్ తనకు లక్ష రూపాయలు ఇచ్చారని ప్రచారం జరగడంతో తోటి ఉద్యోగులు, తన బంధువులు జాక్ పాట్ కొట్టేశావంటూ మాటలతో వేధించారని తెలిపాడు.

ముఖ్యంగా తోటి ఉద్యోగుల మాటలు భరించలేక తాను సీఎమ్మార్ షాపింగ్ మాల్‌లో ఉద్యోగం సైతం మానేశానని.. ఆ తరువాత కొన్ని నెలల పాటు పని లేక ఇబ్బందులు పడ్డానన్నాడు. ఎవరూ కూడా సాయి ధరమ్ తనకేమీ సాయం చేయలేదంటే అసలు నమ్మేవారు కాదన్నాడు.

మరో ట్విస్ట్ ఏంటంటే.. సాయి ధరమ్ తనను కలిశానని చెప్పిన మాటల్లో కూడా నిజం లేదన్నాడు. అసలు ఆయన ఫోన్ నంబరే తన వద్ద లేదని చెప్పాడు. ఒకవేళ సాయి ధరమ్ రమ్మని పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్లి కలుస్తానన్నాడు. తాను విరూపాక్ష చిత్రాన్ని చూశానని చాలా బాగుందని తెలిపాడు. మొత్తమ్మీద ఫర్హాన్ మాటలు వైరల్ అవుతున్నాయి.

సాయి ధరమ్ అలా.. ఫర్హాన్ ఇలా.. వీరిద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారనేది తెలియడం లేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!