Silk Smitha: సిల్క్ స్మిత తన చివరి లేఖలో ప్రస్తావించిన రాధాకృష్ణ ఎవరంటే..
జీవితంలో కష్ట సుఖాలు సర్వసాధారణం. కానీ కష్టం వస్తే తోడుగా నిలబడే వ్యక్తి మాత్రం జీవితానికి చాలా అవసరం. అలాంటి వారు లేనపుడు ఎన్ని ఉన్నా జీవితం నరకమే. సిల్క్ స్మిత(Silk Smitha) జీవితంలో ఎదుర్కొన్న సమస్య ఇదే. కనీసం తోడుగా నిలిచే వ్యక్తి లేకుండా పోయాడు.
తీవ్రమైన మానసిక ఒత్తిడితో 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఆత్మహత్యకు ముందు రోజు ఆమె(Silk Smitha) రాసిన లేఖ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఆ లేఖలో తన చావుకు కారణాలను వెల్లడించారు. ఈ లేఖలో ప్రస్తుతం బాబు, రాము, రాధాకృష్ణ అనే ముగ్గురి పేర్లు వైరల్ అవతున్నాయి. బాబు చాలా మంచివాడని.. తన నుంచి ఎలాంటి డబ్బు ఆశించకుండా అండగా నిలిచాడని సిల్క్ స్మిత(Silk Smitha) పేర్కొన్నారు. రాము, రాధాకృష్ణలపై మాత్రం తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. వీరిద్దరే తనకు అన్యాయం చేశారని.. వారి కోసం తాను ఎంతో చేశానని.. అయినా కూడా ద్రోహం చేశారని.. వారిని దేవుడు శిక్షించాలని లేఖలో కోరారు.
ఈ లేఖలో మరో వ్యక్తి ప్రస్తావన కూడా ఉంది కానీ అతని పేరు మాత్రం బయట పెట్టలేదు. తనకు అతను జీవితాన్ని ఇస్తానన్నాడని.. ఆ తరువాత తనను దూరం పెట్టాడని సిల్క్ స్మిత(Silk Smitha) చెప్పుకొచ్చారు. ఇక అతని వివరాలను మాత్రం వెల్లడించలేదు.
ప్రతి రోజూ టార్చర్.. ఒత్తిడిని తట్టుకోలేకపోయానని లేఖలో పేర్కొన్నారు. ఇక లేఖలో ఆమె ప్రస్తావించిన రాధాకృష్ణ వచ్చేసి ఆమె సెక్రటరీ అని తెలుస్తోంది. రాము అనేది మాత్రం ఎవరో తెలియరాలేదు.