Naga Chaitanya: ఆమెపై క్రష్.. చూడగానే ఫిదా అయిపోయా..: నాగచైతన్య

Naga Chaitanya: ఆమెపై క్రష్.. చూడగానే ఫిదా అయిపోయా..: నాగచైతన్య

ప్రస్తుతం ఎందుకోగానీ హీరో అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) తెగ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలి కాలంలో ఈ యంగ్ హీరో శోభితా ధూళిపాళ్లతో డేటింగ్‌లో ఉన్నాడంటూ ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. లండన్‌లో ఈ ముద్దుగుమ్మతో కలిసి డిన్నర్‌కు వెళ్లి అక్కడ చెఫ్‌కు సెల్ఫీ ఇచ్చాడు. ఆ సెల్ఫీలో శోభితా(Sobitha Dhulipala) కూడా కనిపించింది. దీంతో నెటిజన్లు పెద్ద ఎత్తున ఆ పిక్‌ను వైరల్ చేశారు. వీరిద్దరి డేటింగ్‌కు నిదర్శనం ఇదేనని రచ్చ రచ్చ చేశారు.

ఇక ఇటీవలి కాలంలో నాగ చైతన్య(Naga Chaitanya) పెద్దగా సినిమాలు చేసింది లేదు. చేసినా కూడా హిట్స్ అనేవి లేవు. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు(Venkat Prabhu)తో డైరెక్షన్‌‌లో నటించిన కస్టడీ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపైనే నాగ చైతన్య తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. కృతి శెట్టి(Krithi Shetty) ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ ముద్దుగుమ్మ కెరీర్ కూడా కష్టాల్లోనే ఉంది. ఈ సినిమా హిట్ అయితే వీరిద్దరి కెరీర్‌కు ఇది మంచి బూస్ట్ ఇస్తుంది.

Naga Chaitanya: ఆమెపై క్రష్.. చూడగానే ఫిదా అయిపోయా..: నాగచైతన్య

మే 12న కస్టడీ మూవీ విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రచారం జోరుగా నిర్వహిస్తోంది. తాజాగా చైతూ(Naga Chaitanya) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో మీకు ఏ హీరోయిన్ అంటే క్రష్ అని యాంకర్ అడగ్గా.. చైతూ చెప్పిన సమాధానం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ మధ్య ‘బాబీలోన్’(Babylon) అనే ఇంగ్లీష్ సినిమా చూశానని.. అందులో యాక్ట్ చేసిన మార్గట్ రాబీ(Margot Robbie) ఫెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయ్యానని తెలిపాడు. ఈ క్రమంలోనే ఆమె అంటే క్రష్ ఏర్పడిందట. ఆమెతో కలిసి ఒక్కసారైనా నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!