Naga Chaitanya-Samantha: నాగచైతన్య, సమంత తిరిగి కలవబోతున్నారా?
అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), సమంత(Samantha) విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరికీ సంబంధించి ప్రతిదీ హైలైట్ అవుతోంది. చిన్న చిన్న విషయాలు కూడా హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో స్పందించిన సమంత.. మెల్లిమెల్లిగా స్పందించడమే మానేసింది. అయితే తాజాగా నాగచైతన్య నటించిన కస్టడీ మూవీ విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర యూనిట్ బీభత్సంగా ప్రమోషన్స్ నిర్వహించింది. నాగ చైతన్య కూడా ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చేశాడు.
ప్రస్తుతం నాగ చైతన్య ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు హాట్ టాపిక్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో భాగంగా సమంతపై నాగ చైతన్య ప్రశంసలు గుప్పించాడు. ఆమె చాలా మంచి అమ్మాయని.. ప్రపంచంలోని సంతోషం మొత్తం ఆమెకే చెందాలన్నట్టు చెప్పాడు. అంతేకాకుండా తమ విడాకుల విషయంలో కూడా ఎన్నో రూమర్స్ వచ్చిన విషయాన్ని నాగ చైతన్య గుర్తు చేశాడు. అవన్నీ విని తాను చాలా బాధేసిందని నాగ చైతన్య వివరించాడు.
సామ్ సినిమాలు యశోద(Yashoda), శాకుంతలం(Shaakuntalam) మూవీస్ అన్నీ తాను చూశానని నాగ చైతన్య(Naga Chaitanya) వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలన్నీ చూసిన నెటిజన్లు తమ రిలేషన్, విడాకులు తదితర విషయాలపై ఏనాడు స్పందించని నాగ చైతన్య ఇప్పుడు ఇలా మాట్లాడటంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. చైతు, సామ్ కలవబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంపై నాగ చైతన్య, సమంతలలో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.