Adivi Sesh: అడవి శేష్ పెళ్లికి కుటుంబ సభ్యుల ఏర్పాట్లు.. వధువు ఎవరో తెలుసా?

Adivi Sesh: అడవి శేష్ పెళ్లికి కుటుంబ సభ్యుల ఏర్పాట్లు.. వధువు ఎవరో తెలుసా?

అడవి శేష్.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో సినిమాలకు ఉన్నంత డిమాండ్ టాలీవుడ్‌లో మరెవరికీ లేదని చెప్పాలి. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లను ఎంచుకుని అడవి శేష్ సక్సెస్ అయ్యాడు. అసలు ఆయన సినిమా అంటేనే థియేటర్ బాట పట్టే జనాలు లేకపోలేదు.

క్షణం మూవీ నుంచి మొదలు వరుసబెట్టి విజయాలు అందుకుంటున్నాడు. అదిరిపోయే కంటెంట్ ఇస్తుండటంతో జనాలు కూడా ఆయన బాగా కనెక్ట్ అయిపోయారు. ప్రస్తుతం గూఢచారి సీక్వెల్‌ను రూపొందించే పనిలో అడవి శేష్ బిజీగా ఉన్నాడు.

అడవి శేష్ గురించి గత కొంతకాలంగా మనం ఓ న్యూస్ వింటూనే ఉన్నాం. అది నిజమా? కాదా? అనే డౌట్‌లో ఉన్నాం. అదేంటంటే.. శేష్.. అక్కినేని వారమ్మాయి సుప్రియ యార్లగడ్డతో రిలేషన్‌లో ఉన్నాడని. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ కూడా టాక్ నడిచింది. పైగా తరచూ వీళ్లిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. ఇటీవల మెగా పవర్ స్టరా్ రామ్ చరణ్ బర్త్ డేకి కూడా అడవి శేష్, సుప్రియ జంటగా హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారన్న ప్రచారం మరింత ఎక్కువైంది.

Adivi Sesh: అడవి శేష్ పెళ్లికి కుటుంబ సభ్యుల ఏర్పాట్లు.. వధువు ఎవరో తెలుసా?

తాజాగా వస్తున్న న్యూస్ ఏంటంటే.. అడవి శేష్, సుప్రియ జంట పెళ్లికి సిద్దమైందట. ఇరు కుటుంబాల వారు అంగీకరించడంతో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. నిజానికి అడవి శేష్ కంటే సుప్రియ పెద్దదట. అంతేకాకుండా గతంలో ఆమెకు చరణ్ రెడ్డి అనే వ్యక్తితో వివాహం కూడా జరిగింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ఇప్పుడు అడవి శేష్‌ను పెళ్లాడబోతోందట.

థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!