Charmme Kaur: అవన్నీ రహస్యంగా చేయడంటూ ఓడ్కా గ్లాస్‌తో సందేశమిస్తున్న ఛార్మి

Charmme Kaur: అవన్నీ రహస్యంగా చేయడంటూ ఓడ్కా గ్లాస్‌తో సందేశమిస్తున్న ఛార్మి

లైగర్ వివాదం కొనసాగుతుండగానే.. ఆ చిత్ర నిర్మాత చార్మి నిన్న (మే 17)న పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఈ క్రమంలోనే ఈ పంజాబీ భామ ఆసక్తికర పోస్ట్ పెట్టంది. ఒకవైపు లైగర్ ఎగ్జిబిటర్స్ ఫిలిం ఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తుండగానే.. పుట్టిన రోజు వేడుకను జరపుకుని ఆసక్తికర పోస్టును పెట్టింది. అది కూడా చేతిలో వోడ్కా గ్లాస్ పట్టుకుని తీసుకున్న ఫోటోను పోస్ట్ చేసి మరీ పోస్ట్ పెట్టడం గమనార్హం. 

‘‘నచ్చిన ప్రదేశానికి వెళ్ళండి, నిజమైన ప్రేమను పొందండి, ఆనందంగా జీవించండి. ఇవన్నీ రహస్యంగా చేయండి. లేదంటే ఈ జనాలు మీ సంతోషాలు నాశనం చేస్తారు’’ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక పక్కా లైగర్ మూవీ కారణంగా నిండా మునిగాంరా బాబోయ్ అంటూ ఎగ్జిబిటర్స్ నిరాహార దీక్షలు చేస్తుంటే కనీసం స్పందన కూడా లేకుండా.. ఇప్పుడు ఇలాంటి పోస్టులేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

2002లో నీ తోడు కావాలి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఛార్మి.. ఆ తరువాత గౌరీ, మాస్, లక్ష్మీ, రాఖీ, పౌర్ణమి, చక్రం వంటి చిత్రాలతో ఫేమస్ అయిపోయింది.

పూరి జగన్నాథ్‌కి దగ్గరయ్యాక ఛార్మి నటనకు గుడ్ బై చెప్పేసి నిర్మాతగా మారింది. కానీ ఏం ప్రయోజనం వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాల్లో కేవలం ఇస్మార్ట్ శంకర్ మాత్రమే విజయం సాధించింది. లైగర్ సినిమా హిట్ అయి ఉంటే వీరి కెరీర్ మరోలా ఉండేది కానీ ఫ్లాప్‌తో పెద్ద దెబ్బే తగిలింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!