Tollywood: టాలీవుడ్ సక్సెస్ ఫార్ములాను పట్టేసిందట.. ఆ ఒక్క విషయంలో కేర్ తీసుకుంటే..

Tollywood: టాలీవుడ్ సక్సెస్ ఫార్ములాను పట్టేసిందట.. ఆ ఒక్క విషయంలో కేర్ తీసుకుంటే..

టాలీవుడ్‌లో ఇప్పుడొక విషయం హాట్ టాపిక్‌గా మారింది. సక్సెస్ ఫార్ములా ఏంటో టాలీవుడ్ పట్టేసిందని. మరి ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి? అంటే తెలంగాణ స్లాంగ్. ఇది వాడితే మాత్రం సినిమా సూపర్ హిట్ ఖాయం. అయితే ఏపీ ప్రజానీకానికి మాత్రం భాష పెద్దగా అర్థం కావడం లేదు. ఫలితంగా తెలంగాణలో దుమ్మురేపిన దసరా, బలం చిత్రాలు ఆంధ్రాలో అంతంత మాత్రంగానే ఆడాయి. కానీ ఈ రెండు సినిమాలు సూపర్ హిట్.

అయితే ఇండస్ట్రీలో ఏ సెంటిమెంట్ అయినా వర్కవుట్ అయ్యిందా? ఇక దాన్ని వదలరు. రీసెంట్‌గా తెలంగాణ స్లాంగ్ సెంటిమెంట్ బాక్సాఫీస్‌ని శాసిస్తోంది.  

ఇక తాజాగా ‘మేము ఫేమస్’ చిత్రం కూడా తెలంగాణ నేటివిటీతో తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. కొత్త వాళ్లతో తీసిన సినిమాయే అయినా కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇక మరి కొద్ది రోజులు ముందుకు వెళితే డీజే టిల్లు.

డీజే టిల్లు చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్. దీనికి కారణం కూడా తెలంగాణ స్లాంగేనని టాక్. తెలంగాణ స్లాంగ్‌తో హ్యూమర్ బాగా వర్కవుట్ అవుతోందని.. ఇది కూడా సక్సెస్‌కు కారణమవుతోందని టాలీవుడ్ టాక్. చిన్న హీరోలే కాదు.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వంటి వారు సైతం తెలంగాణ స్లాంగ్ మాట్లాడి సూపర్ హిట్స్ అందుకున్నారు. కాస్త ఏపీ ప్రజలకు సైతం అర్థమయ్యే తెలంగాణ స్లాంగ్‌ను వాడగలిగితే మాత్రం ఏపీ ప్రేక్షకులు కూడా ఇబ్బంది ఉండదని.. తద్వారా టాలీవుడ్‌ని ఏలడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!