Ram Charan-Upasana Daughter: రామ్ చరణ్ కూతురి జాతకంపై సంచలనం విషయాలు వెల్లడించిన వేణుస్వామి
హీరో రామ్ చరణ్, ఉపాసన(Ram Charan-Upasana)లకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ వచ్చింది. పాప పుట్టడంతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది. నిన్నంతా అపోలో ఆసుపత్రి ప్రాంగణం సెలబ్రిటీల రాకపోకలతో సందడిగా మారింది. ఇక మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అయితే వారసురాలి రాకతో తెగ సంబరపడిపోయారు. తమకు ఇష్టమైన మంగళవారం రోజున పాప పుట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. పాప శుభ ఘడియల్లో పుట్టిందన్నారు.
పాప కడుపులో ఉన్నప్పటి నుంచే తమ ఫ్యామిలీకి మంచి జరగడం ప్రారంభమైందన్నారు. రామ్ చరణ్(Ram Charan) గ్లోబల్ స్టార్ అవడం, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)కు పెళ్లి సెట్ అవడం వంటి మంచి కార్యక్రమాలు జరిగాయంటూ చిరు ఆనందపరవశులయ్యారు. ఇక పాప జాతకాన్ని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సైతం చూసి అంతా బాగానే ఉంది కానీ ఓ సంచలన విషయాన్ని కూడా వెల్లడించారు. చెర్రీ కూతురు రాత్రి 1:49 నిమిషాలకు జన్మించింది కాబట్టి ఆమె రాశి మిథునమని.. నక్షత్రం పునర్వసు అని చెప్పుకొచ్చారు.
పాప జన్మనం కోణంగి అని వేణు స్వామి(Venu Swamy) తెలిపారు. రామ్ చరణ్(Ram Charan) కూతురికి రాజయోగం కనిపిస్తోందన్నారు. ఇక పాప రాకతో మున్ముందు కుటుంబంలో మరిన్ని సంతోషాలు, శుభాలు కలుగుతాయన్నారు. చిన్నారి జాతకం.. చిరంజీవి(Chiranjeevi) జాతకంతో సమానంగా ఉందని వేణు స్వామి తెలిపారు. ఆమె భవిష్యత్లో చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు.
కీర్తిలో రామ్ చరణ్, ఉపాసనలను కూడా దాటేస్తుందన్నారు. అయితే జాతకంలో చిన్న చిన్న లోపాలు కూడా ఉన్నాయని దీంతో పాపకు నరాలు, పంటి, చెవికి సంబంధించిన సమస్యలు రావొచ్చని వేణు స్వామి తెలిపారు. ఇక చెర్రీ దంపతుల జాతక రీత్యా మరో బిడ్డను పొందే అవకాశం లేదన్నారు.
ఇవీ చదవండి:
మెగా ఫ్యామిలీ కోరిక తీరలేదా? సెంటిమెంట్ వెంటాడిందా?
ఆదిపురుష్ వసూళ్లన్నీ హమ్మక్.. తప్పుతప్పుగా చెబుతున్నారట..
రాకేష్ మాస్టర్ దుస్థితి గురించి తెలిస్తే కన్నీళ్లాగవు..!
సముద్రపు అడుగున ఎన్టీఆర్, సైఫ్ల యుద్ధం.. ఈసారి కొరటాల బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమేనట..