Anand Deverakonda: పాపం.. బేబీ.. హిట్టయినా రౌడీ తమ్ముడికి నిరాశే !
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న సామెత కొందిరిక బాగా సూట్ అవుతుంది. ఇక ఇండస్ట్రీలో అయితే ప్రస్తుతం మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda)కు బాగా సూట్ అవుతుంది. మొత్తానికి ‘బేబీ’(Baby) మూవీతో హిట్ కొట్టాడులే అనుకుంటుంటే.. అంతలోనే మన యంగ్ హీరోకి షాకింగ్ న్యూస్. అసలేం జరిగింది? సినిమా హిట్ అయినా ఆనంద్ ఎందుకు నిరాశలో ఉన్నాడనే దానిపై ఓ లుక్కేద్దాం.
చిన్న సినిమా అయ్యినప్పటికీ కూడా యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ రప్పించుకున్న చిత్రాలలో ఒకటి ‘బేబీ’. ఈ లవ్ స్టోరీకి యూత్ అయితే బ్రహ్మరథం పడుతున్నారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తోంది. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్(Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.11 కోట్ల 20 లక్షలు వసూలు చేసింది.
అంతా బాగానే ఉంది కానీ అల్లుడు నోట్లో శని అన్నట్టుగా ఈ సినిమా క్రెడిట్ మొత్తం హీరోయిన్ ఖాతాలోకి వెళుతోంది. హీరో ఆనంద్ దేవరకొండను ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో సినిమా హిట్ అయినా కూడా ఆనంద్కి ఆశించిన ఫలితం రాలేదట. ఇక యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని సినిమాల్లో అడపాదప అవకాశాలను దక్కించుకుంటున్న వైష్ణవి కెరీర్‌కి ఈ చిత్రం మాంచి బూస్ట్ ఇచ్చింది.
ఇవీ చదవండి:
ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్న విశ్వక్ సేన్
3 వారాల్లో ‘సామజవరగమన’ మూవీ ఎంత రాబట్టిందో తెలిస్తే..
‘బేబి’ తొలిరోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా ?