Allu Arha: మహేష్ మూవీలో బన్నీ డాటర్.. సూపర్బ్ కదా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో అదిరిపోయే సినిమా రాబోతోంది. ఇప్పటివరకూ సినిమాకు సంబంధించి లెక్కలేనన్ని రూమర్స్ వచ్చాయ్. అయితే వీటిపై ఇప్పటి వరకూ మేకర్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు కూడా. తాజాగా సినిమాలో ఓ క్రేజీ రోల్ గురించి పుకార్లు.. షికార్లు చేస్తున్నాయ్. అదేమిటంటే.. మహేష్ మూవీలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కుమార్తె ‘అర్హ’ (Allu Arha) నటిస్తోందని టాక్ నడుస్తోంది. ఏడేళ్ల పాప పాత్రలో అర్హ అయితే సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట.
ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్త నిజమైతే.. బన్నీ ఫ్యామిలీ అంగీకరిస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే అర్హ.. ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. షూటింగ్‌లో యమా యాక్టివ్‌గా ఉన్న బన్నీ డాటర్‌ను చూసిన ఈ మాట.. త్రివిక్రమ్ చెవిన వేశారట. అందుకే.. ఈ బుల్లిపిల్లను పట్టుబట్టి మరీ సినిమాలోకి తీసుకోవాలని మాటల మాంత్రికుడు అనుకుంటున్నాడట.
మరోవైపు.. ఆల్రెడీ బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షూటింగ్ కూడా షురూ అవుతోందని కూడా టాక్ నడుస్తోంది. అయితే ఇందులో నిజానిజాలెంతో అధికారిక ప్రకటన వచ్చేవరకూ చూడాల్సిందే. కాగా.. ఈ సినిమాలో పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్దే.. సూపర్‌స్టార్ (Mahesh Babu) సరసన నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబోపై భారీ అంచనాలే ఉన్నాయ్.