Anasuya: రంగమ్మత్తకు.. ఒకే మూవీలో సాంగ్, కిక్కెకించే రోల్..!

Anasuya role in pushpa 2

అనసూయ.. (Anasuya) అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలో.. మంచి పాత్ర అయితే సైడ్ యాక్టర్‌గా కూడా చేస్తూ వస్తోంది. ఆఖరికి తల్లి, వదిన పాత్రల్లో కూడా చేస్తూ మురిపిస్తోంది. ఇక జబర్దస్త్‌లో అయితే చిట్టి పొట్టి బట్టలతో అందాలను ఆరబోసేస్తోంది. ఫొటో షూట్‌లో అయితే.. బాబోయ్.. ఈ ముదురుభామ అందాలు చూడటానికి రెండు కళ్లూ సరిపోవ్. ఈ అందాలకు ఫిదా అయిన మేకర్స్ వరుస ఆఫర్లు ఇచ్చేస్తున్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తాను తెరకెక్కించే ప్రతి సినిమాలోనూ హాట్ భామ అనసూయ (Anasuya) అదిరిపోయే పాత్ర ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా, ‘పుష్ప’ మూవీలో నెగిటివ్‌ రోల్ ఇచ్చాడు. ఈ రెండు పాత్రలూ గ్లామర్ టచ్ ఉండేవే. అయినా సరే సుక్కు సినిమా అంటే అను ఎగేసుకుని నటించేస్తోంది. ఇప్పుడు ‘పుష్ప-2’ (Pushpa 2) సినిమాలో కూడా లక్కీ ఛాన్స్ కొట్టేసిందట ఈ యాంకరమ్మ (Anchor Anasuya). ఇందులో మంచి కిక్కెంచే పాత్రతో పాటు.. మంచి నాటు మసాలా సాంగ్ కూడా అనసూయతోనే ప్లాన్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఊ.. అంటావా మామా..’ రేంజ్‌లో పాట ఉంటుందని ఫిల్మ్‌నగర్ టాక్.

Anasuya role in pushpa 2

మొదట అనుకు రోల్ వరకే అనుకున్నా.. సాంగ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సాంగ్‌ కూడా తానే చేసేస్తానని చెప్పేసిందట. ఇందుకు సంబంధించి ప్రస్తుతం రిహార్సల్స్ సాగుతున్నాయని టాక్. బికినీలో కూడా ఒకట్రెండు షాట్స్ ఉంటాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంటే.. అడిగి మరీ అందాలు ఆరబోయడానికి ముద్దుగుమ్మ ముందుకొచ్చిందన్న మాట. అను ఆంటీ యాక్టింగ్‌లో మాత్రం అదిరిపోయేలా ఉంటుంది.. ఇంతవరకూ ఎలాంటి ఢోకా లేదు. ఇప్పటికే ఒకట్రెండు ఐటమ్ సాంగ్‌లో కూడా ఆడిపాడింది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్ ఇరగదీస్తాడు. అలాంటి బన్నీ సరసన రంగమ్మత్త ఏ మాత్రం రాణిస్తుందో చూడాలి. అసలు ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే మరి.

Google News