Rajinikanth Daughter: లవ్ మ్యారేజీ చేసుకోబోతున్న రజనీకాంత్ కుమార్తె..!
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) కుమార్తె ఐశ్వర్య (Aishwarya) రెండో పెళ్లి చేసుకోనుందా..? కబాలీ.. తన ఆప్త మిత్రుడి కుమారుడికే ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమనిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య పెళ్లి చేసుకున్న 17 ఏళ్లకు కుటుంబ కలహాలు వల్ల విడిపోయారు. విడాకులకు కారణాలేంటి అనేది ఇంతవరకూ ఎక్కడా లీక్ కాలేదు కానీ.. ఓ అమ్మాయే అని టాక్ మాత్రం నడించింది. దీంతో ఎవరికి వారుగా విడిపోయి పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తున్నారు. ఈ తరుణంలో రజనీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు కోలీవుడ్ నాట వార్త కోడై కూస్తోంది.
రజనీ..(Rajinikanth) ఆప్త మిత్రుడు కుమారుడికే ఐశ్వర్యను ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడట. ఆయన.. చెన్నైలో బడా బిజినెస్‌మెన్ అని టాక్. అంతేకాదు.. అతనికి కూడా పెళ్లయ్యి ఐశ్వర్యలాగే విడాకులు అయ్యాయట. ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఐశ్వర్య-బిజినెస్‌మెన్ కలుసుకున్నారట. అక్కడే ఈ ఇద్దరి చూపులు కలుసుకుని.. ప్రేమ దాకా వెళ్లిందట. ఈ విషయం ఇరు కుటుంబాల్లో కూడా తెలియగా.. ఎవరూ అభ్యంతరం చెప్పలేదట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది వేసవిలో ఈ ప్రేమ జంటకు పెళ్లి జరగనుందట.
పెళ్లయ్యాక.. ఐశ్వర్య-ధనుష్ (Aishwarya – Dhanush) లకు జన్మించిన పిల్లల పరిస్థితేంటి అనేది తెలియాల్సి ఉంది. పూర్తిగా ధనుష్ చూసుకుంటాడా లేకుంటే ఐశ్వర్య (Aishwarya) చూసుకుంటుందా.. లేకుంటే ఇద్దరూ కలిసే చూసుకుంటారా అనేది లెక్క తేలాల్సి ఉంది. మరోవైపు.. ధనుష్ కూడా ఎప్పటికైనా మరో పెళ్లి చేసుకోవాల్సిందే. అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటో. మొత్తానికి చూస్తే.. త్వరలోనే ఇద్దరూ కొత్త జీవితాలు ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారన్న మాట. కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న ఐశ్వర్య మ్యారేజీ విషయంలో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే మరి.