Prabhas: వంద కోట్ల రెమ్యునరేషన్.. అయినా అప్పు ఎందుకు డార్లింగ్!

టాలీవుడ్ స్టార్ హీరో రెబల్‌స్టార్ ప్రభాస్ (Prabhas) ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఇంకాస్త డిమాండ్ చేస్తే అది కాస్త ఇంకో పదో.. పదిహేనో పెరగొచ్చు కూడా. అయినా సరే ప్రభాస్ మాత్రం అప్పులు మాత్రం చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి 21 కోట్ల రూపాయిలు లోన్ తీసుకున్నాడట. అది కూడా సొంత ప్రాపర్టీ పెట్టి మరీ తీసుకున్నాడని టాక్. కోటాను కోట్లు రెమ్యునరేషన్, నాలుగైదు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉన్న ప్రభాస్ అప్పు ఎందుకు చేశాడన్నది ఇప్పుడే హాట్ టాపిక్.

వాస్తవానికి ఏదైనా ప్రాపర్టీ లేదా కారు కొనాలన్నా ఖచ్చితంగా బ్యాంక్ లోన్ ఎంతో కొంత పెట్టాల్సిందే. అది కూడా ఈఎంఐ రూపంలో కట్టాల్సిందే. ఇది సామాన్యుడికైనా.. సెలబ్రిటీకి అయినా ఒక్కటే రూల్. అయితే ప్రభాస్ మాత్రం ఏకంగా 21 కోట్లు అప్పు తీసుకోవడంతో ఇంత అప్పు ఎందుకు తీసుకున్నాడబ్బా అని ఫిల్మ్‌నగర్‌లో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ మధ్య ప్రభాస్ (Rebel Star Prabhas) నటించిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

దీంతో నిర్మాతలు నష్టపోకూడదని తన రెమ్యునరేషన్ నుంచి భారీగానే వెనక్కి ఇచ్చేశాడు డార్లింగ్. తనకు నష్టం అయినప్పటికీ నిర్మాతలు బాగుంటే మరో సినిమా వస్తుంది కదా భావించి రిటర్న్ చేశాడు. టైమ్‌కు తన దగ్గర లేకపోవడంతో బాగా కావాల్సిన మిత్రుడితో అప్పు చేసి మరీ.. నిర్మాతలకు ఇచ్చాడట ప్రభాస్ (Prabhas). అందుకే ఆ అప్పు తీర్చడానికి ఇలా బ్యాంక్‌లో 21 కోట్ల రూపాయిలు తీసుకోవాల్సి వచ్చిందట. అయినా అప్పులు తీసుకోవడం అంత పెద్ద నేరమేమీ కాదుగా అని డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో.. ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా ఉంటాయ్ కదా.. దీనిపై ఇంత రచ్చ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సో.. ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది మరి.