Pradeep Machiraju: ఫైనల్‌గా పెళ్లి పీటలెక్కబోతున్న టాప్ యాంకర్..!

Anchor Pradeep Wedding

వెండితెర‌పై యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ (Prabhas) పెళ్లి.. బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) పెళ్లి.. ఈ రెండూ ఎప్పుడూ హాట్ టాపిక్కే. ప్రదీప్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పడానికి ఏమీ లేదు. ఆర్జేగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లో.. ఇప్పుడు యాంకర్‌గా.. మధ్య మధ్యలో హీరోగా నటిస్తూ మెప్పిస్తున్నాడు మోస్ట్ బ్యాచిలర్ యాంకర్. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్‌లో మేల్ యాంకర్లలో టాప్ ఇతనే. ప్రదీప్ చేయిపడితే ఆ షో సూపర్ హిట్టేనని నిర్వాహకులు చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతుంటారు.

ఇక ప్రభాస్, ప్రదీప్.. పెళ్లిళ్లు ఎప్పుడెప్పుడు అవుతాయా అని అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. బహుశా.. డార్లింగ్ ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో కాదేమో కానీ.. ప్రదీప్ మాత్రం త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదండోయ్.. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్. అంతకుమించిన విషయం ఏమిటంటే.. అది మతాంతర వివాహమట. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును ప్రదీప్ చాలా రోజులుగా ప్రేమిస్తున్న విషయం తెలిసిందే. ప్రేమను కాస్త నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాలని భావించిన ఈ జంట.. ఇరుకుటుంబాల్లో విషయం మాట్లాడగా అంగీకరించారట. వ‌చ్చే ఏడాది పెళ్లి బంధంతో ఒక‌టి కావాల‌ని ప్రదీప్‌-న‌వ్య నిశ్చయించారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

Anchor Pradeep Wedding2

నవ్య.. బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియా సెలబ్రిటీలకు ఫ్యాషన్ డిజైనర్‌గా చేస్తూ మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా టాప్ షోగా పేరుగాంచిన ‘బిగ్‌బాస్’ (Bigg Boss) కంటెస్టెంట్స్‌‌లో చాలామందికి ఈమే కాస్టూమ్స్ డిజైన్ చేస్తుందని కూడా టాక్ ఉంది. అయితే.. మొదట వీరిద్దరి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేదట. ఆ తర్వాత ప్రదీప్-నవ్య (Pradeep – Navya) బెస్ట్ ఫ్రెండ్స్, లవర్స్‌గా మారారట. ఇరు కుటుంబాల మతాలు వేరైనప్పటికీ చక్కని జంట.. పైగా ప్రేమించుకున్నారు.. అంతకు మించి కెరీర్‌లో ఇద్దరికీ ఎలాంటి ఢోకా లేదు అని భావించిన పెద్దలు పెళ్లితో ఒకటి చేయాలని భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్‌లో మూడు మూళ్లతో ఒక్కటి కాబోతోందట ఈ జంట.

లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజీ చేసుకుంటానని పలుమార్లు ఇంటర్వ్యూల్లో ప్రదీప్ చెప్పాడు కూడా. సో.. ప్రేమించిన అమ్మాయి నవ్య అని క్లారిటీగా అర్థమవుతోంది. ఇప్పటికే చాలాసార్లు పెళ్లిపై వార్తలు రాగా వాటిపై సెటైర్లేసిన నవ్వుకున్న ఈసారి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఈసారైనా ఈ పెళ్లి వార్తను నిజం చేస్తాడో లేదో వేచి చూడాలి. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ వేచి చూడాల్సిందే మరి.

Google News