NTR-Prabhas: ఎన్టీఆర్-ప్రభాస్‌తో జక్కన్న పాన్ ఇండియా మూవీ..!

Ntr Prabhas Movie

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో తెలుగు సినిమా ప్రఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి.. అలియాస్ జక్కన్న. RRR హడావుడి నుంచి ఇంకా బయటికి రాలేదు. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులు ఈ సినిమాను వరించగా.. ఆస్కార్ బరిలో నిలిపే ప్రయత్నాల్లో బిజీబిజీగా ఉన్నాడు జక్కన్న (SS Rajamouli). మరోవైపు.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో త్వరలో తీస్తున్న సినిమాకు కథను మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. అయితే తాజాగా.. ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే వార్త ఒకటి నెట్టింట్లో షికారు చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్-ప్రభాస్‌ (NTR-Prabhas)తో మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయ్.

Rajamouli

మల్టీస్టారర్, పాన్ ఇండియా మూవీలకే ఈ మధ్య జక్కన్న(Rajamouli) ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ వార్తలు రాగానే నిజమే అయ్యుండొచ్చని సోషల్ మీడియాలో అటు ప్రభాస్.. ఇటు జూనియర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వార్తలు షేర్ చేస్తున్నారు. కొందరైతే బాబోయ్.. ‘బాహుబలి’తోనే ప్రభాస్ సగం జీవితం గడిపేశాడు.. ఇక మళ్లీ పాన్ ఇండియా అంటే పరిస్థితేంటి..? పెళ్లయినా చేసుకోవాలా వద్దా మా హీరో అంటూ డార్లింగ్ ఫ్యాన్స్.. జక్కన్నపై సెటైర్లు వేస్తున్నారు. ఎన్టీఆర్‌కు హిట్ సినిమాలు అందించడంతో ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. అలాగే.. ప్రభాస్ అయితే ఇక జక్కన్న అంటే పడి చచ్చేంత ప్రేమ ఉంది. సో.. ఇద్దరితో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. అయినా రాజమౌళి తలుచుకుంటే ఇవన్నీ పెద్ద లెక్కేమీ కాదు.

ప్రస్తుతం మహేశ్ కోసం కథ మెరుగులు దిద్దుతున్న రాజమౌళి.. సినిమా పూర్తి కావాలంటే కనీసం ఏడాది నుంచి రెండేళ్లయినా పడుతుంది. అలాంటిది నెక్స్ట్ మూవీ ప్లానింగ్‌లో ఉన్నాడంటే నమ్మడం కాస్త కష్టమే. అయితే ఇదంతా రానున్న రోజుల్లో చేయడానికి ముందస్తుగా ప్లానింగ్ చేసుకున్నాడనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో నడుస్తోంది. సడన్ సర్‌ప్రైజ్‌లు ఇవ్వడంలో జక్కన్న తర్వాతే ఎవరైనా.. ఏమో ఎన్టీఆర్-ప్రభాస్‌తో మూవీ ఉన్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ముందుగా మహేశ్‌తో సినిమా అయ్యాక.. రాజమౌళి నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూద్దాం.

Google News