Anchor Anasuya: ఆంటీ అని పిలవడం వెనుక అర్థం వేరే ఉంటుంది.. అందుకే నచ్చదు: అనసూయ

Anchor Anasuya about Aunty

యాంకర్ అనసూయ (Anchor Anasuya).. ఎందుకోగానీ తరచుగా ట్రోలింగ్ కి గురవుతుంది. ఏ పోస్ట్ పెట్టినా కూడా నెగిటివ్ కామెంట్స్ సర్వసాధారణం. ఏ యాంకర్ కూడా ఇప్పటి వరకూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. దీనికి కారణం లేకపోలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటారు కానీ వారంతా లైట్ తీసుకున్నారు. కానీ అనసూయ (Anasuya) మాత్రం అస్సలు సహించదు. ఒకింత ఈగో కూడా నెటిజన్లకు కోపం తెప్పిస్తుంది. తానేదో స్టార్ యాంకర్‌ననే ఫీలింగ్ ఆమెకు నరనరాల్లోనూ జీర్ణించుకుపోయిందని నెటిజన్ల కామెంట్.

మొత్తానికి ఆమె అంటేనే దాదాపు ఎవ్వరికీ పెద్దగా పడదు. ఆమె బిహేవియర్ చాలా ప్రౌడ్‌గా ఉంటుందని చాలా మంది చెబుతున్న మాట. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా మందికి నచ్చదు. అందుకే వరుస నెగిటివ్ కామెంట్స్. ఇక ఇటీవలి కాలంలో అనసూయను ఆంటీ అంటూ చాలా మంది పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.. చేస్తున్నారు కూడా. వేరొకరైతే లైట్ తీసుకునే వారు. సమస్యను పెద్దది చేసే వారు కాదు. అనసూయ (Anchor Anasuya) మాత్రం దాన్ని చాలా పెద్దది చేసేసింది. చివరకు పోలీస్ కేసుల వరకూ వెళ్లి నానా రచ్చ చేసింది.

Anchor Anasuya about Aunty

ఇలాంటి బట్టలు నీకు అవసరమా ఆంటీ?, నువ్వు ఎంత ట్రై చేసిన నువ్వు అమ్మాయివి కావు ఆంటీవే? అంటూ ట్రోల్ చేశారు. అయితే తాజాగా అనసూయను ఓ నెటిజన్ ‘అక్కా మీకు ఆంటీ అంటే అంత కోపం ఎందుకు? అని అడిగాడు. దీనికి అనసూయ ఇచ్చిన సమాధానం తెగ వైరల్ అవుతోంది. ఆంటీ అంటే తనకు కోపం వస్తుందని.. ఆ పిలుపు వెనుక వారి అర్ధం వేరే ఉంటుందని తెలిపింది. అయితే ఈ మధ్య తనకు ఆంటీ అంటే కోపం రావడం లేదని.. వాళ్ల ఖర్మకు వాళ్లను వదిలేశానని చెప్పింది. ఆ పనికిమాలిన వాళ్లను మార్చాల్సిన అవసరం తనకు లేదని తనకు చాలా ముఖ్యమైన పనులున్నాయని అనసూయ తేల్చి చెప్పింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!