ఇప్పుడు కాకి హవా నడుస్తోంది.. ఇది ఉందంటే సినిమా సూపర్ హిట్టేనట..

Kaki sentiment in telugu movies

బలగం మూవీలో కీలకాంశం ఏంటి? పిండాలను కాకి ముట్టడం. దీని చుట్టూనే కథంతా తిరుగుతుంది. నేటి బంధాలను హైలైట్ చేస్తూ తీసిన చిత్రం. కాకే ఈ చిత్రంలో మెయిల్ రోల్ పోషించిందని చెప్పాలి. నిజానికి ఇప్పటి వరకూ సినిమాలన్నింటిలో సింహం, పులి, ఎద్దు వంటి జంతువులను హీరోయిజం చూపించడానికి వాడారు. కానీ ఎవరూ కూడా కాకిని వాడిన పాపాన పోలేదు. ఇక తాజాగా విడుదలైన బలగం, దసరా మూవీల్లో కాకిని వాడి హిట్ కొట్టారనే టాక్ బీభత్సంగా నడించింది.

Balagam Telugu Movie

ఇక తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాలోనూ కాకిదే డామినేషన్. ఇప్పుడు కాకి మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బోయపాటి ఎక్కువగా ఎద్దుల్ని చూపిస్తే.. రాజమౌళి ఏనుగు, పులులతో హీరోని చూపించారు. తాజాగా ఈ లిస్టులోకి కాకి కూడా వచ్చి చేరింది. ఇప్పటి వరకూ బ్యాడ్ లక్ అనుకున్న కాకి నిర్మాతలకు మాత్రం అదృష్టంగా మారింది. కాసులు కురిపిస్తోంది. తాజాగా విరూపాక్ష సినిమాలోనూ కీలక పాత్ర పోషించింది.

Virupaksha Telugu Movie

సస్పెన్స్‌ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందిన విరూపాక్షలో చేతబడి, తాంగ్రిక విద్య వంటి మూఢ నమ్మకాలను హైలైట్ చేశారు. దీనికి సైంటిఫిక్ అంశాల్ని జోడించి మరీ వదిలారు. ఇక తాంత్రిక విద్యలు కాబట్టి కాకిని సైతం బీభత్సంగా వాడేశారు. ఎంట్రీలోనే హీరోకి కాకి షాకిస్తుంది. ఇక ఆ తర్వాత కూడా స్టోరీలో కాకిదే హవా. హీరోహీరోయిన్ల తర్వాత మెయిన్ రోల్ కాకిదే.

ఈ సినిమాతో కాకి సెంటిమెంట్ బీభత్సంగా పెరిగిపోవడం ఖాయం. కాబట్టి ఇక మున్ముందు సినిమాల్లో ఏదో ఒక సీన్‌లో మనం కాకిని చూడటం మాత్రం ఆనవాయితీగా వస్తుందేమో చూడాలి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!