Mahesh Babu – Pawan Kalyan: తొలిసారిగా పవన్ వర్సెస్ మహేష్.. సంక్రాంతికి యుద్ధమే..

Mahesh Babu, Pawan Kalyan film

సంక్రాంతి (Sankranthi) అంటే.. అటు కోళ్ల పందాలు.. ఇటు మూవీ లవర్స్‌కి స్టార్ హీరోల సినిమాలు. వావ్.. ఈసారి సంక్రాంతి ఏ ఏ హీరోల సినిమాలు రాబోతున్నాయి? ఎవరెవరు తలపడబోతున్నారనే చర్చ సోషల్ మీడియాలో కొన్ని నెలల ముందు నుంచే ప్రారంభమైపోతుంది. ఇక సంక్రాంతి వస్తుందనగానే ఏ ఏ హీరోల సినిమాలు బరిలో ఉంటాయో ఆయా హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ కూడా ప్రారంభమైపోతుంది. సినిమా హిట్టో ఫట్టో తేలే వరకూ ఈ వార్ నడుస్తూనే ఉంటుంది.

ఇద్దరు హీరోల సినిమాలు హిట్ అయ్యాయా.. ఓకే.. లేదంటే మళ్లీ వార్ బిగిన్ అవుతుంది. ఇక ఈసారి ఏ హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో నిలవనున్నాయో ఇప్పటికే తేలిపోయింది. ఆల్రెడీ ఒక సినిమా అఫీషియల్ అనౌన్స్ డేట్ వచ్చేసింది. మరో సినిమా కూడా విడుదల పక్కా అని తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరంటే.. ఒకరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా సంక్రాంతి బరిలోనే నిలవనున్నారని టాక్.

మెగాస్టార్ విషయంలో క్లారిటీ అయితే లేదు కానీ.. పవన్, మహేష్‌ (Mahesh Babu – Pawan Kalyan)లు మాత్రం పక్కాగా సంక్రాంతికి వచ్చేస్తున్నారు. ఆల్రెడీ మహేష్ (Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబో #SSMB28 మూవీ సంక్రాంతికి రిలీజ్ అని చెబుతూ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించేసింది. ఇక పవన్ (Pawan Kalyan)- క్రిష్ (Krish) కాంబోలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) కూడా సంక్రాంతి బరిలోనే నిలవబోతోందని ఫిలింనగర్ టాక్. ఇప్పటికే క్లైమాక్స్ మినహా.. మిగిలిన షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తి అయ్యిందట. తొలిసారిగా పవన్ – మహేష్‌లు తలపడబోతున్నారు. ఇక ఫ్యాన్స్ సంబరాల్లో తేలిపోతున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!