Amala Akkineni: అక్కినేని అమల.. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా ఆమే.. కారణం ఏంటంటే..

Amala Akkineni

సినిమా ఇండస్ట్రీలో కాస్త పేరు ప్రతిష్టలు వచ్చాయంటే ఓ రేంజ్‌లో రెచ్చిపోతుంటారు. ఆ హంగూ ఆర్భాటం చూడలేం. బయటకు వస్తే చాలు.. ఫారిన్‌లో పుట్టి పెరిగినట్టుగా బిల్డప్ ఇస్తారు. ఇక కాస్త ఆస్థి పాస్తులు వస్తే మరీనూ.. ఇక ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే.. ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) తర్వాత ఆయన వారసత్వాన్ని ఆయన కుమారుడు నాగార్జున (Nagarjuna), మనవళ్లు ముందుకు తీసుకెళుతున్నారు. ఇక నాగార్జున భార్య అమల (Amala Akkineni) కూడా అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.

అయితే ఆమె ప్రస్తుతం సినిమాల్లోనూ బయట ఎక్కడ చూసినా చాలా సింపుల్‌గా కనిపిస్తారు. ఎక్కువగా చీరల్లోనే దర్శనమిస్తుంటారు. అది కూడా కాటన్ శారీస్. నగలు, నట్రా అంటే వాటి జోలికే వెళ్లరు. మహా అయితే సింపుల్‌గా ఒక చెయిన్‌తో దర్శనమిస్తారు. నిజానికి ఆమె స్థానంలో వేరొకరు ఎవరున్నా కూడా కాస్ట్లీ చీరలు, ఒంటినిండా నగలతో మెరిసిపోతుంటారు. అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family) కి కొన్ని తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఉంది. కానీ అమల మాత్రం ఎప్పుడూ ఆడంబరాలకు వెళ్లరు.

Amala Akkineni Nagarjuna

నిజానికి అమల (Amala Akkineni)కు మొదటి నుంచి సింప్లిసిటీ అనేది నరనరాల్లోనూ అల్లుకుపోయిందట. డబ్బును వృథా చేయడం… ఇష్టానుసారంగా ఏవి పడితే ఆ దుస్తులు ధరించడం.. ఒంటినిండా నగలు దిగేసుకోవడం వంటివి నచ్చవట. ఇప్పటికీ ఆమె కాటన్ చీరలో సింపుల్ లుక్స్‌లో కనిపించడానికి ఇష్టపడుతుంది తప్పిస్తే.. ఆడంబరాలకు వెళ్లరు. అందుకే అమల అంటే జనాలకి చాలా ఇష్టం. ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే ఆమెను ఆరాధిస్తుంటారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!