Nandamuri Mokshagna: స్టార్ డైరెక్టర్ కుమారుడి దర్శకత్వంలో బాలయ్య కొడుకు తొలి సినిమా..!

Nandamuri Balakrishna and his son Mokshagna

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇదిగో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.. అదిగో ఇవ్వబోతున్నారంటూ ఏళ్లకేళ్లు గడుస్తున్నాయే కానీ ఎంట్రీ ఇచ్చిందైతే లేదు. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఓ ఆసక్తికర విషయం తెగ వైరల్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram Srinivas) కుమారుడి దర్శకత్వంలో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) నటించనున్నాడంటూ పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. అసలు ఇందులో నిజమెంత? ఈ టాక్ ఎలా వచ్చింది?

ప్రస్తుతం మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) బరువుపై దృష్టి సారించాడట. మరోవైపు తన తొలి సినిమాకి సంబంధించి కథలను సైతం వింటున్నాడట. ఓకే అయితే రంగంలోకి దిగడమే తరువాయి అని తెుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా త్రివిక్రమ్ భార్య సౌజన్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తమ పెద్ద కొడుకు సినీ రంగంలోకి అడుగు పెట్టబోతున్నాడని.. అతనికి దర్శకత్వంపై విపరీతమైన ప్యాషన్ ఉందని సౌజన్య తెలిపారు. దర్శకత్వంపై తమ కుమారుడికి ఉన్న మక్కువ చూసి త్రివిక్రమ్ (Trivikram Srinivas) సైతం ఆశ్చర్యపోతుంటారట.

Nandamuri Balakrishna and his son Mokshagna

అయితే మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) సినీ ఎంట్రీ, త్రివిక్రమ్ కుమారుడి సినీ ఎంట్రీ ఒకే సమయంలో జరుగుతుండటంతో ఓ ప్రచారం స్టార్ట్ అయ్యింది. అదే త్రివిక్రమ్ కుమారుడి దర్శకత్వంలో మోక్షజ్ఞ నటించనున్నాడని. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. బాలయ్య తన కుమారుడిని ఒక మంచి సక్సెస్‌ఫుల్ దర్శకుడి చేతిలో పెడతారు కానీ డెబ్యూ డైరెక్టర్ చేతిలో పెట్టి ప్రయోగాలైతే చేయరు. ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఎవరి దారి వారిదే. మొత్తానికి 2025 నాటికి మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) సినిమా థియేటర్స్‌లోకి రావడం పక్కా అట.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!