Sampoornesh Babu: సంపూ ఏమైపోయాడు? సోషల్ మీడియాలో చర్చ…!

Sampoornesh Babu

సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) గుర్తున్నాడా? ఎంత సడెన్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడో అంతే సడెన్‌గా మాయమయ్యాడు. 2014లో విడుదలైన హృదయ కాలేయం చిత్రం ద్వారా సంపూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అసలు ఈ సినిమాలోకి సంపూని తీసుకోవడమే ఆసక్తికరంగా జరిగింది. నరసింహా చారి అని ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి బాగా జుట్టు పెంచుకుని రంగు రంగు బట్టలు వేసుకుని స్టూడియోల చుట్టూ అవకాశాల కోసం తిరిగేవాడు. అతను మరెవరో కాదు.. మన సంపూయే.

ఇక నరసింహాచారిని చూసిన సాయి రాజేష్.. తన వద్ద ఒక కథ ఉందని చెప్పారట. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్‌ నీలో ఉన్నాయని.. అయితే అదో చెత్త స్టోరీ అని.. విడుదలయ్యాక జనం కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని.. ఆ సినిమాలో హీరో వేషం చేస్తావా? అని అడిగారట. దీనికి సై అన్నాడట నరసింహాచారి. సినిమా చూసి జనం కొట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారికి దొరక్కుండా పేర్లు మార్చుకుందాం అనుకున్నారట. అలా నరసింహాచారి కాస్తా.. సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) అయ్యాడు. సాయిరాజేష్ కాస్తా స్టీవెన్ శంకర్ అయ్యారు.

Sampoornesh Babu in Kobbari Matta

2014లో విడుదలైన హృదయ కాలేయం ఓ సెన్సేషన్. ఎందుకో జనాలు ఆ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోవడంతో మంచి హిట్ అయ్యింది. సంపూ(Sampoornesh Babu) పేరు మారుమోగింది. ఇక ఆ తరువాత పలు సినిమాలు చేసినా కూడా కలిసి రాలేదు. అయితే కొబ్బరి మట్ట సినిమా మాత్రం సంపూకి మళ్లీ మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే సంపూ ఎందుకోగానీ ఇటీవల కనిపించడమే మానేశాడు. అవకాశాలు ఎవ్వరూ ఇవ్వడం లేదో.. మరింకేంటో కానీ సంపూ మాత్రం సినిమాలకు దూరమయ్యాడు. ఆ మధ్య కామెడీ షోలలో కనిపించినా కూడా అది కూడా తాత్కాలికమే. తాజాగా సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) బర్త్ డే వీడియోను సాయి రాజేష్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో జనాలంతా సంపూ ఏమయ్యాడా? అని చర్చించుకోవడం మొదలు పెట్టారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!