Balagam Rupa Lakshmi: ‘బలగం’ లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ స్థానం విలువైంది కాబట్టి ప్రభాస్‌తోనైనా ఓకేనట..!

Balagam Rupa Lakshmi

గత కొన్నేళ్లలో ఏ సినిమా అయినా గ్రామాల్లో బహిరంగ ప్రదర్శన వేసి చూడటమనేది చూశామా? అది ఒక్క ‘బలగం’ (Balagam) సినిమాకే సాధ్యమైంది. దర్శకుడు వేణు ఎల్దండి (Venu Yeldandi) బలగం చిత్ర కథను రాసి, దర్శకత్వం వహించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాను హన్షిత, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా నటించిన వారంతా దాదాపు కొత్తవారే. ఒక్క ప్రియదర్శి (Priyadarshi), వేణు (Venu) తప్ప. ఇక ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్.. నటీనటులకు గొప్ప పేరు వచ్చింది.

సినిమాలో ప్రతి ఒక్క పాత్ర కూడా చాలా నేచురల్‌గా అనిపించింది. దీనికి కారణం ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం లేని నటీనటులను తీసుకోవడమేనని తెలుస్తోంది. ఈ సినిమాలో బాగా ఆకట్టుకున్న పాత్రల్లో లక్ష్మి (Rupa Lakshmi) ఒకటి. అసలా లక్ష్మి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె అసలు పేరు రూప లక్ష్మి (Rupa Lakshmi). రైతు ఇంట జన్మించింది. తమ తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం కావడంతో ఆమెను ఒక లెక్చరర్‌కి దత్తత ఇచ్చారట.

Balagam Rupa Lakshmi

నిజానికి తల్లి పాత్రల్లో నటించే వయసు కాదు ఆమెది. కానీ సినిమాపై ఉన్న ప్యాషన్ రూప లక్ష్మిని ఆ క్యారెక్టర్ చేసేలా చేసింది. అయితే ఇంటర్వ్యూలో ప్రభాస్‌ (Prabhas) కి తల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తారా? అని ప్రశ్నించగా.. ప్రపంచంలో మాతృత్వం కంటే గొప్పది ఏదీ ఉండదని.. ఆ స్థానం విలువైందని కాబట్టి సంతోషంగా చేస్తానని తెలిపింది. ప్రభాసే (Prabhas) కాదు.. ఏ స్టార్ హీరోకి తల్లిగా నటించడానికైనా సిద్ధమని తెలిపింది. అంతేకాదు.. 70 ఏళ్ల వ్యక్తికి తల్లిగా నటించామన్నా చేయడానికి సిద్ధమని వెల్లడించింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!