Sai Dharam Tej: తొలిసారిగా తన యాక్సిడెంట్‌పై పెదవి విప్పిన సాయి ధరమ్.. ఏం చెప్పాడంటే..

Sai Dharam Tej talks about accident

సాయి ధరమ్ తేజ్‌(Sai Dharam Tej)కు యాక్సిడెంట్ అయి చావు వరకూ వెళ్లి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. అతను బతకడం కష్టమని చాలా మంది భావించారు. నిజానికి ఆ సమయంలో అతని సిట్యువేషన్ కూడా అలాగే ఉంది. ఇక క్షేమంగా ఆసుపత్రి సాయి ధరమ్ (Sai Dharam Tej) ఇంటికి వచ్చాక మాత్రం తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాత్రం కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

తనకు జరిగిన ప్రమాదం ఒక పాఠాన్ని నేర్పిందని.. దాన్ని తానెప్పుడూ పీడకలలా భావించబోనని అదొక స్వీట్ మెమరీ అని తెలిపాడు. ఈ యాక్సిడెంట్ కారణంగా తానెంతో నేర్చుకున్నానని వివరించాడు. ముఖ్యంగా మాట విలువేంటో అర్ధమైందన్నాడు. తాను ఎప్పుడూ చిన్నప్పటి నుంచి చాటర్ బాక్సులా మాట్లాడే వాడనని కానీ తనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు తనకు మాట రాలేదన్నాడు. గొంతు పెగలక మాట్లాడలేకపోయినప్పుడు మాట విలువ తెలిసిందన్నాుడు.

Sai Dharam Tej

ఇంట్లో వాళ్లంతా తనకు అండగా నిలిచారని సాయి ధరమ్ (Sai Dharam Tej) తెలిపాడు. షూటింగ్‌లో సైతం తనకు తోటి నటులు, చిన్న మామయ్య పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ధైర్యాన్ని నూరి పోశాడని వెల్లడించాడు. తన మాట అర్ధం కాకున్నా కూడా మరోసారి చెప్పించుకుని అర్థం చేసుకునే వారన్నాడు. ఇక తన తల్లి తనకు భయాన్ని జయించడం నేర్పి తిరిగి బైక్ ఎక్కేలా చేసిందన్నాడు. ముఖ్యంగా తనకు ఎంత మంది ఆప్తులున్నారు? తన కోసం ఎంత మంది ప్రార్థించారనేవి తెలిశాయని.. ఇది కదా తన అసలైన సంపాదన అని సాయి ధరమ్ తెలిపాడు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!