Sreeleela: బాలయ్య మూవీలో మాస్ సాంగ్ ఇరగదీయనున్న శ్రీలీల.. పాటకు ఎన్ని కోట్లు అంటే..!

Sreeleela, Balakrishna

ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న ముద్దుగుమ్మలో శ్రీలీల(Sreeleela) ఒకరు. యంగ్, సీనియర్ హీరోలనే తేడా లేకుండా ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేసోస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే అమ్మడికి కనీసం హిట్, ఫ్లాపులతో కూడా సంబంధం లేదు. అవకాశాలు వచ్చి పడుతున్నాయంతే.. ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర అంటే బాలయ్యకు కూతురిగా శ్రీలీల నటిస్తోంది.

బాలయ్య – అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా కోసం అదిరిపోయే మాస్ సాంగ్ ను తాజాగా రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. ఇక సాంగ్‌లో ముంబాయి నుంచి వచ్చిన డ్యాన్సర్లు, లోకల్ జూనియర్ ఆర్టిస్ట్‌లు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పాట మొత్తం చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలోనే ఉండనుంది. శ్రీలీల ఈ సాంగ్‌లో మాస్ స్టెప్పులతో ఇరగదీయనుందట. నాలుగైదు రోజుల పాటు పాట చిత్రీకరణ కొనసాగనుంది. ఓ ఉత్సవం నేపథ్యంలో ఈ మాస్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య, మాస్ సాంగ్ అంటే ఉండే క్రేజే వేరు. శ్రీలీల (Sreeleela) స్టెప్పులు కూడా కలిస్తే ఇక రచ్చ రచ్చే.

Advertisement
Sreeleela

ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఒక్క పాట కోసమే చిత్ర యూనిట్ ఐదు కోట్లు ఖర్చు చేస్తోందట. ఇక ఈ మాస్ సాంగ్‌కు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) మ్యూజిక్ అందిస్తున్నారు. మాంచి క్యాచీ మాస్ ట్యూన్‌తో ఆ సాంగ్ సాగుతోంది. కెమెరాలు, లైటింగ్, క్రేన్స్ నుంచి ముంబై డ్యాన్సర్లు వారి ఖర్చులు, ఫిలిం సిటీ ఫీజులు తదితర ఖర్చులన్నీ కలిపితే తడిసి మోపెడవుతోందట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ (Kajal Aggarwal) నటిస్తోంది. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!