Samantha: ఆ హీరో అయితే నేను చాలా చాలా హ్యాపీ.. షాకిచ్చిన సమంత

Samantha

మనిషన్నాక కోరికలు సహజం. వీటికి సామాన్యులు, సెలబ్రిటీలన్న భేదం ఉండదు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలకు తమకు ఇష్టమైన నటుడు, నటితో సినిమా చేయాలనే కోరిక ఉంటుంది. వీటితో పాటే కొన్ని డ్రీమ్ రోల్స్ కూడా సర్వసాధారణంగానే ఉంటాయి. ఇక స్టార్ హీరోయిన్ సమంత(Samantha)కు ఏమైనా వీటి నుంచి మినహాయింపు ఉంటుందా? అంటే ఏమాత్రం ఉండదు. ఆమెకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అలాగే కొందరు ఇష్టమైన నటులు ఉంటారు. వీటితో పాటే వారితో నటించాలన్న కోరిక కూడా సర్వసాధారణంగానే ఉంటుంది.

అయితే ఆమె మనసులో ఉన్న డ్రీమ్ హీరో ఎవరనేది ఆసక్తికరం. ఆయన మరెవరో కాదు.. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil). మలయాళంలో స్ట్రయిట్ సినిమా అంటూ చేస్తే మాత్రం.. అది ఫహాద్ ఫాజిల్‌తోనే చేయాలనేది సామ్ కోరిక. ఇప్పటికే ఆయనతో ఓ సినిమా నటించినప్పటికీ.. ఆయన సినిమాలో చాలా తక్కువ పోర్షన్ అని.. అది తనకు చాలదని స్పష్టం చేసింది. ఫహాద్ (Fahadh Faasil)తో ఫుల్ లెంగ్త్ సినిమాలో నటించాలని ఉందంటూ తన మనసులో కోరికను సామ్ (Samantha)ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

Samantha With Fahadh Faasil

అయితే మలయాళంలో నేరుగా సినిమా ఎప్పుడు చేస్తారని అని అడగ్గా.. ఈ ముద్దుగుమ్మ ఇలాంటి ఆన్సర్ ఇచ్చి షాక్ ఇచ్చింది. ఇక ఏదో ఒకరోజు మలయాళం సినిమా చేయడం పక్కా అని తేల్చి చెప్పింది. అయితే ఆ సినిమాలో తన జంటగా ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) హీరోగా చేస్తే.. తాను చాలా చాలా హ్యాపీ ఫీలవుతానని సామ్ (Samantha) వెల్లడించింది. ఇప్పటికే యశోద మూవీతో మాంచి హిట్ కొట్టిన సామ్.. ప్రస్తుతం శాకుంతలం (Shaakuntalam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌తో బిజీబిజీగా గడిపేస్తోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!