Rajamouli at NTR30: ‘ఎన్టీఆర్ 30’ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన పనికి అవాక్కైన టాలీవుడ్..

Rajamouli at NTR 30

ఎన్టీఆర్ (NTR)-కొరటాల శివ (Koratala Siva) కాంబోలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ (NTR 30) లాంచింగ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందనుంది. ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్‌కి చెందిన అతిరథమహారథులంతా తరలివచ్చారు. అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగానే అక్కడకు చేరుకున్న రాజమౌళి(Rajamouli).. ఎన్టీఆర్-జాన్వీ కపూర్‌ల (NTR – Janhvi Kapoor) మీద తొలి షాట్‌కు క్లాప్ కొట్టగా.. ప్రశాంత్ నీల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఇక ఎన్టీఆర్ 30 (NTR30)లో జాన్వీకపూర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. నిజానికి జాన్వీని మనం ఎప్పుడూ హాట్ డ్రెస్సుల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఈ ఈవెంట్‌కు ఆమె పద్ధతిగా చీరలో వచ్చి ఆకట్టుకుంది. ఇదంతా పక్కనబెడితే ఈ ఈవెంట్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జక్కన్న వెళ్లి జాన్వీ (Janhvi Kapoor)తో కాసేపు ముచ్చటించి ఆపై ఆమె ఆటోగ్రాఫ్ తీసుకోవడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఆస్కార్ (Oscar) విన్నింగ్ డైరెక్టర్ ఏంటి? ఇప్పటి వరకూ పెద్దగా హిట్సే లేని జాన్వీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడమేంటి? నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా.

Janhvi Kapoor Ntr In Ntr30

అయితే జక్కన్న(Rajamouli) కూతురు మయూఖ.. జాన్వీ ఫ్యాన్ అట. ఆమె తన తండ్రికి జాన్వీ (Janhvi Kapoor) ఆటో గ్రాఫ్ తీసుకురమ్మని చెప్పారట. కూతురు కోసం అలా మన జక్కన్న.. జాన్వీ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకుని పెద్ద చర్చనీయాంశంగా మారారు. ఇక రాజమౌళి తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆ పనుల్లోనే బిజీగానే ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే ఆసక్తి కొనసాగుతుంది. రాజమౌళి (Rajamouli) ఏకంగా హాలీవుడ్ భామను దించుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇవీ చదవండి:

రాజమౌళి నన్ను అవమానించారు.. సీనియర్ నటి ఆవేదన..!

పండుగ పూట ఫ్యాన్స్ గుండెల్లో గునపాలు దింపిన స్టార్ హీరోలు

Google News