Ester Noronha: నోయల్ వల్ల టార్చర్ అనుభవించా : ఎస్తేర్

Singer Noel, Ester Noronha

సింగర్ నోయల్ (Singer Noel) – హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా(Ester Noronha).. వీరి వివాహ జీవితం ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లైన ఏడాదికే ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయింది. 2019లో వివాహం చేసుకున్న ఈ జంట.. అనూహ్యంగా 2020లో విడాకులు తీసుకున్నారు. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారన్న విషయం మాత్రం ఇప్పటి వరకూ బయటకు రాలేదు. వీరిది లవ్ మ్యారేజ్ అనే టాక్ కూడా అప్పట్లో నడిచింది. మరి అలాంటి జంట ఎందుకు ఎక్కువ కాలం వైవాహిక జీవితంలో నిలవలేకపోయిందని అంతా ఆశ్చర్యపోయారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్తేర్ (Ester Noronha) తన విడాకులకు కారణాలను తెలిపింది. తమది లవ్ మ్యారేజ్ కాదని.. అరేంజ్డ్ మ్యారేజ్ అని వెల్లడించింది. కేవలం పెళ్లికి ముందు తామిద్దరం సన్నిహితంగా ఉన్న కారణంగానే అంతా తమది లవ్ మ్యారేజ్ అనుకున్నారని తెలిపింది. తనను పెళ్లి చేసుకోవడానికి ముందు నోయెల్ చాలా మంచివాడిలా నటించాడని.. పెళ్లైన తర్వాత కానీ అసలు విషయం బయటకు రాలేదని పేర్కొంది. పెళ్లికి ముందు చెప్పిన మాటలకు.. అసలు సంబంధమే లేదని తెలిపింది.

Singer Noel, Ester Noronha

పెళ్ళైపోయిందిలే.. ఇక ఎక్కడకు వెళుతుందన్నట్లు ప్రవర్తించడం.. మానసిక వేదనకు గురి చేయడం వంటివి చేసే వాడని ఎస్తేర్ (Ester Noronha) తెలిపింది. అతని వల్ల టార్చర్ అనుభవించానని.. అందుకే విడాకులు తీసుకున్నట్టు తెలిపింది. చివరికి బిగ్ బాస్ హౌస్లో కూడా నోయల్ (Noel) తనను తప్పుగా చూపించి సింపతీ పొందే ప్రయత్నం చేశాడని తెలిపింది. ఎస్తేర్ నటి మాత్రమే కాకుండా మంచి సింగర్‌గా కూడా గుర్తింపు పొందింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో బిజీబిజీగా కాలం వెళ్లదీస్తోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!