Prabhas: ఆదిపురుష్‌ను అల్లాడిస్తున్న ట్రోల్స్.. రాముడిగా ప్రభాస్ అస్సలు బాగోలేడట..

Trolling On Prabhas

ప్రస్తుతం ఆదిపురుష్ మేనియా(Adipurush Mania) నడుస్తోంది. ఈ సినిమా అనుకున్నప్పటి నుంచే ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్‌ను కొన్ని భయాలు అయితే వెంటాడాయి. శ్రీరాముడిగా ప్రభాస్‌ను జనం ఆదరిస్తారా? గ్రాఫిక్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయా? సినిమాపై ఏమైనా ట్రోల్స్ వస్తే పరిస్థితి ఏంటి? వంటి ప్రశ్నలు జనాలను ఇబ్బంది పెట్టాయి. అయితే ఆదిపురుష్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ట్విటర్ టాక్ కూడా వచ్చేసింది.

అనుకున్నదంతా అయ్యింది. మూవీ ఇలా విడుదలైందో లేదో.. అలా ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. విజువల్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదని మండిపడుతున్నారు. రాముడిగా ప్రభాస్(Prabhas) మెప్పించలేదంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ప్రభాస్(Prabhas) బాగానే ఉన్నాడు కానీ గతంలో రాముడి పాత్రలు చేసిన వారితో కంపేర్ చేసి వారి ముందు నథింగ్ అంటున్నారు. యాంటీ ఫ్యాన్స్‌తో పాటు క్రిటిక్స్ కూడా ఆదిపురుష్‌కు ఏమాత్రం హైప్ ఇవ్వడం లేదు. పైగా టార్గెట్ చేస్తున్నారు.

Prabhas: ఆదిపురుష్‌ను అల్లాడిస్తున్న ట్రోల్స్.. రాముడిగా ప్రభాస్ అస్సలు బాగోలేడట..

ఇక రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ అస్సలు సెట్ కాలేదట. ఆయన గెటప్‌ను తీర్చిదిద్దిన తీరు చాలా పేలవంగా ఉందంటున్నారు. థోర్ వంటి హాలీవుడ్ మూవీస్ స్ఫూర్తితో సైఫ్(Saif Ali Khan) లుక్‌ని ఓం రౌత్(Om Raut) డిజైన్ చేశారని అంటున్నారు. విజువల్ వర్క్ విషయంలో కూడా శ్రద్ధ పెట్టలేదంటున్నారు. ఇక ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని కూడా చెబుతున్నారు. మరి నిజంగానే సినిమా మెప్పించడం లేదా? లేదంటే కావాలని పనిగట్టుకుని ట్రోల్ చేస్తున్నారా? అనేది తెలియడం లేదు.

ఇవీ చదవండి:

‘ఆదిపురుష్’ ట్విటర్ టాక్ ఎలా ఉందంటే..

అల్లు అర్జున్ రాకతో జనసంద్రంగా మారిన అమీర్‌పేట్..

‘ఆదిపురుష్’ కీలక పాత్రధారులు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..

బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ ధరకు ‘భగవంత్ కేసరి’ ఓటీటీ రైట్స్.. ఎంతంటే..

ఆదిపురుష్ దెబ్బకు అల్లాడిపోయిన బుక్ మై షో

Google News