NTR: ఆస్కార్ బరిలో ఎన్టీఆర్..! హాలీవుడ్ స్టార్ హీరోలతో పోటీ..

Ntr In Oscar

ఆస్కార్ (Oscar Award) పట్ల తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి ఉండదు. ఎందుకంటే ఆస్కార్ బరిలో మన తెలుగు సినిమాలకు ప్రాధాన్యముండదన్న అపోహో.. మరొకటో. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి చాటి చెప్పడంతో కథ మారింది. రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ఎంట్రీతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల ఫోకస్.. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంపై మళ్లింది.

ఇక మరో ఆసక్తికర విషయం తాజాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఆస్కార్ రేసులో దూసుకుపోతున్నాడన్న వార్త అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. ఆస్కార్ బెస్ట్ యాక్టర్ (Oscar Best Actor) ప్రిడిక్షన్ టాప్ – 10 లిస్ట్‌లో యంగ్ టైగర్ దూసుకెళుతున్నాడట. ఇండియన్ ఫిల్మ్ చరిత్రలోనే తొలిసారిగా ఒక భారతీయ నటుడు ఆస్కార్ టాప్ – 10 అంచనాల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.

Ntr In Oscar Race

విల్‌ స్మిత్‌, హ్యూ జాక్‌మన్ వంటి హాలీవుడ్‌ స్టార్స్‌ పేర్లతో ఉన్న ఈ జాబితాలో మన ఎన్టీఆర్‌ (NTR) చోటు దక్కించుకోవడంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ (NTR Fans) అభిమానులైతే పట్టరాని సంతోషంలో మునిగి తేలుతున్నారు. ‘వెరైటీ’ కథనం ప్రకారం ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ నటుడి జాబితాలో ఎన్టీఆర్ (Jr NTR) పేర్లు ‘ఆస్కార్‌’కు నామినేట్‌ అయ్యే అవకాశం ఉంది.

Google News