షాకింగ్.. స్టార్ హీరో కూడా విడాకులు తీసుకోబోతున్నారట..!

సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణం. అయితే 28 ఏళ్లు కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకోవడమే కాస్త విడ్డూరంగా అనిపిస్తోంది. తమిళ్ 

ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దళపతి (Vijay Thalapathy) కూడా విడాకులు తీసుకోబోతున్నారట. మరి ఈ వార్తలో నిజమెంతుందో కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది.  

vijay wife sangeetha

మరికొద్ది రోజుల్లో విజయ్ నటించిన వారసుడు (Varasudu) చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటం అభిమానులకు పెద్దగా మింగుడు పడటం లేదు. మూడు రోజులుగా ఈ న్యూస్ వైరల్ అవుతున్నా కూడా విజయ్ (Vijay) దీనిపై స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మధ్య విజయ్.. భార్యతో కలిసి ఎక్కడా కూడా కనిపించడం లేదు. 

నిజానికి సినిమా ఈవెంట్స్‌కి భార్యతో హాజరయ్యే విజయ్.. ఇటీవల కనిపించకపోవడంతోనే ఈ రూమర్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ (Kollywood) స్టార్ డైరెక్టర్ అట్లీ భార్య సీమంతం వేడుకలోనూ స్టార్ సెలబ్రిటీస్ అంతా హాజరయ్యారు కానీ విజయ్ భార్య సంగీత (Vijay wife Sangeetha) మాత్రం కనిపించలేదు. దీంతో విడాకుల విషయం మరింత వైరల్ అవుతోంది. అసలు విజయ్, ఆయన భార్యకు మధ్య గొడవలేం ఉన్నాయనేది తెలియ రావడం లేదు. ఏదీఏమైనా విజయ్ స్పందిస్తే కానీ ఈ వార్తలపై క్లారిటీ రాదు.