NTR – Janhvi Kapoor: తాతకు జతగా శ్రీదేవి.. ఎన్టీఆర్‌కు జతగా జాన్వీ.. వాటే కాంబో సర్ జీ..!

NTR , Janhvi Kapoor

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావు (NT Ramarao), అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కలిసి నటించిన సినిమాలు పెను సంచలనం సృష్టించాయి. తొలుత ఎన్టీఆర్‌ (NTR)కు మనవరాలిగా నటించిన శ్రీదేవి (Sridevi).. ఆ తరువాత హీరోయిన్‌గా కూడా నటించడం విశేషం. వీరిద్దరూ వెండితెరను ఎలిన వారే.. ఎన్నో ఏళ్లపాటు సినీ ప్రేక్షకులను అలరించిన వీరిద్దరూ ప్రస్తుతం మన మధ్య లేరు. అయితే.. ఇన్నాళ్లకు మరో ఆసక్తికర ఘటన వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఎన్టీఆర్ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) – శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఇప్పుడు ఓ సినిమా కోసం జట్టు కడుతున్నారు.

Janhvi Kapoor in NTR 30 Movie
Janhvi Kapoor remunaration for NTR 30 movie

అయితే తొలిసారిగా రాఘవేంద్రరావు.. ఎన్టీఆర్ – శ్రీదేవి (NTR-Sridevi)తో సినిమాను తెరకెక్కించాలని భావించారట. అయితే మనవరాలితో సినిమా అంటే ప్రేక్షకులు మరోలా భావిస్తారని ఆయన ఒప్పుకోలేదు. కానీ రాఘవేంద్రరావు (Raghavendra Rao) మాట తీసేయలేక అంగీకరించారట. ఆ సినిమాయే వేటగాడు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తరువాత వీరిద్దరి కాంబోలో ఏకంగా 12 సినిమాలు రూపొందాయి. ఎన్టీఆర్ (NTR), శ్రీదేవి (Sridevi) కలిసి నటించిన చివరి సినిమా.. 1982లో విడుదలైంది. అదే ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’.

Janhvi Kapoor in NTR 30
Jhanvi Kapoor in NTR 30

ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌– జాన్వీ కపూర్‌ (NTR – Janhvi Kapoor) కాంబినేషన్‌లో సినిమా రూపొందుతుండడంతో నందమూరి అభిమానులు మరోసారి ఎన్టీఆర్ – శ్రీదేవి (NTR-Sridevi) కాంబోని గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ 30లో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారనగానే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. అయితే ఈ సినిమాలో జాన్వీకపూర్ నటిస్తోందా? లేదంటే ఊహాగానాలేనా? అనేది తొలుత తెలియ లేదు. కానీ ఇటీవలే దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని 2024, ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఇప్పటికే తెలిపింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!