Honey Rose: తెలుగు స్టేట్స్‌ను దున్నేస్తున్న హనీ బేబీ…!

Honey Rose

మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్యూటిఫుల్ హీరోయిన్ హనీ రోజ్ (Honey Rose).. ఇప్పుడీ ముద్దుగుమ్మ పేరు ఎక్కడ చూసినా మారుమోగుతోంది. మంచి పర్సనాలిటీ ఉండటంతో జనాలు కూడా అమ్మడికి బ్రహ్మరథం పడుతున్నారు. అమ్మడు ఎక్కడికి వచ్చిందని తెలిసినా జనాలు క్యూ కడుతున్నారు. దీంతో అమ్మడికి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ ఓపెనింగ్ జరిగినా హనీ బేబీ (Honey Rose)యే కనిపిస్తోంది. షాపింగ్ మాల్స్.. ఓపెనింగ్స్ అంటూ హడావుడి చేస్తోంది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమాతో అమ్మడికి స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఈ సినిమా బాగా కలిసొచ్చింది.  

Honey Rose With Balakrishna

మొత్తానికి అమ్మడు (Honey Rose) చేసింది తెలుగులో ఒకటి రెండు సినిమాయే అయినా కూడా సినిమాలతో సంబంధం లేకుండా మంచి క్రేజ్ లభిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. కమర్షియల్ యాడ్స్ ద్వారా మొదట్లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసింది హనీ రోజ్ (Honey Rose). ఆ తరువాత అమ్మడికి చిన్న మెల్లగా చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత మీడియం రేంజ్ హీరోలు.. తాజాగా సీనియర్ హీరో బాలయ్య (Balakrishna)తో మూవీ. మొదట 2007లో ఈ బ్యూటీ తెలుగులో ఆలయం (Aalayam) అనే ఒక సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. దీంతో అమ్మడికి అవకాశాలు రాలేదు. 

Honey Rose 2

ఇక ఈ ఏడాది మొత్తానికి హనీ రోజ్(Honey Rose) టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి బాలయ్య సినిమాతో అడుగుపెట్టింది. అప్పుడు అడ్రస్ లేకుండా పోయిన ఈ ముద్దుగుమ్మ బాలయ్య సినిమాతో అద్భుతమైన క్రేజ్‌ను అందుకుంటోంది. వీర సింహారెడ్డి (Veera Simha Reddy) సినిమాలో ఆమె చేసిన పాత్ర బాగానే క్లిక్ అయింది. దీంతో అమ్మడి (Honey Rose) అందచందాలకు కుర్రాళ్లు ఫిదా. ఇక ఆమె ఏం చేసినా సంచలనమే. ప్రతిరోజూ ఆమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తెలుగు సినిమాుల పెద్దగా లేకున్నా కూడా ఓపెనింగ్స్ వంటి వాటి ద్వారా విపరీతంగా డబ్బు సంపాదిస్తూ తెలుగు రాష్ట్రాలను దున్నేస్తోంది హనీ బేబి (Honey Rose).

Google News
రాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!బ్లాక్ అండ్ బ్లూ జీన్స్‌లో అదరగొడుతున్న తమన్నా!నమ్రత పర్సనల్ సీక్రెట్స్ ఇవిగో..థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయక్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న సితార..