Nagababu: RRR @ 80 కోట్లు : తమ్మారెడ్డికి నాగబాబు పచ్చి బూతులతో సమాధానం..!

Nagababu Thammareddy

తెలుగు సినిమా రుచిని ప్రపంచానికి తెలియజేసిన దర్శకధీరుడు రాజమౌళి. హాలీవుడ్ దర్శకులు సైతం విస్తుబోయేలా చేసిన ఘనత ఆయనదే. ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR)ను నిలపడం అంటే మాటలు కాదు. తెలుగు వారంతా గర్వించాల్సిన తరుణంలో విమర్శలా? రూ.80 కోట్లు ఖర్చు పెట్టారంటూ మాటలా? వీళ్లను ఏమనాలి? చివరకు తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja) సైతం ఫ్లైట్ ఖర్చులకు రూ.80 కోట్లు ఖర్చు పెట్టారంటూ సెటైర్లు. మరో సరికొత్త రికార్డుకు ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) చేరువలో ఉన్న తరుణంలో ఇలాంటి వ్యంగ్యాస్త్రాలేంటి? ప్రతి ఒక్కరికీ కోపం తెప్పిస్తోంది.

రాజమౌళి (Rajamouli) అండ్ టీమ్ కొన్ని రోజులుగా అమెరికాలో ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారో తెలియంది కాదు. కానీ.. దీనిని కూడా కొందరు కమర్షియల్‌గా ఆలోచిస్తే ఎలా? అసలు ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్‌కి ఎంపికైందనగానే తెలుగువారి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ విజయం తమ సొంత విజయమన్నట్టుగా సంబరపడ్డారు. మరో రెండు రోజులలో తెలుగు సినిమా సత్తా.. అమెరికా స్టేజ్‌పై కనిపించనుందని ఖుషీ అవుతున్న తరుణంలో.. కొందరు లేనిపోని కామెంట్స్ చేస్తున్నారు. దీని వల్ల వారికి ఒరిగేదేంటో వారికే తెలియాలి. ఒకవేళ వార్తల్లో నిలవాలంటే ఇదా దారి?

ఆర్ఆర్ఆర్‌పై వస్తున్న నీచమైన కామెంట్లపై మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) మీద కామెంట్స్ చేస్తున్న వారందరికీ వైసీపీ వారి భాషలో నా సమాధానం.. అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘‘నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం (#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం)’’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు సైతం పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. సరైన సమయంలో సరైన ట్వీట్ అంటూ నాగబాబు (Nagababu)పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదీ చదవండి: RRR Oscar: ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు: తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!