RRR Oscar: ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు: తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy On Rrr

ఆస్కార్ (Oscar Awards)బరిలో ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమా నిలవడం మాటేమో కానీ.. కొందరు చేసే విమర్శలు మాత్రం మరింత దారుణంగా ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే దారుణంగా విమర్శలు గుప్పించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల ఓ మీడియా సంస్థ ఆర్ఆర్ఆర్‌ (RRR)పై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సైతం ఆర్ఆర్ఆర్ సినిమాపై అక్కసునంతా వెళ్లగక్కారు. ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

‘‘ఆస్కార్ ఫ్లైట్ ఖర్చులకి ఆర్ఆర్ఆర్ సినిమా టీం 80 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇప్పుడొచ్చే ఆస్కార్ (Oscar Awards) కోసం ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie) టీం ఫ్లైట్ టికెట్ల కోసమే 80 కోట్లు పైగా ఖర్చు చేశారు. ఆ 80 కోట్లు ఇస్తే 8, 10 సినిమాలు తీసి వాళ్ళ మొహాన కొడతాం’’ అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఆస్కార్ బరిలోకి ఒక తెలుగు సినిమా రావడం అనేది తెలుగు వారందరికీ గర్వకారణం. నిజానికి ఈ సినిమా ఆస్కార్ బరిలోకి వచ్చిందనగానే తెలుగు ప్రేక్షకులంతా సంబరాలు చేసుకున్నారు. కానీ తమ్మారెడ్డి ఏంటి తన స్థాయిని మరచి మరీ వ్యాఖ్యలు చేశారు.

Rrr Movie 1

తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie) ఆస్కార్‌ (Oscar Awards)కు వెళ్లడంతో ఓ మీడియా సంస్థ కూడా తన అక్కసునంతా వెళ్లగక్కింది. రాజ‌మౌళి (Rajamouli) హాలీవుడ్ మీడియా వాళ్లతో బేరాలు కుదుర్చుకున్నారంటూ పిచ్చి రాతలు రాసింది. మొత్తానికి ఆస్కార్ భారం 70 – 80 కోట్లు అవుతుందని.. అదంతా నిర్మాతల నెత్తి మీదే పడుతుందని తెలిపింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు బాగా ఫైర్ అయ్యారు. ఏది ఏమైనా ఎవరెంత అక్కసు వెళ్లగక్కినా కూడా తెలుగు సినిమాను ఆస్కార్ రేంజ్‌కి తీసుకెళ్లిన ఘనత మాత్రం రాజమౌళిదే. తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి చాటింది మాత్రం ఆర్ఆర్ఆరే.

RRR Oscarపై తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా.. ?

View Results

Loading ... Loading ...
Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!