Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమాలు మాత్రమే చేస్తారా.. ఇదేం రూమర్..!?

Pawan Kalyan

తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై ఓ రూమర్ హల్ చల్ చేస్తోంది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేసి తిరిగి ఎన్నికలు వచ్చేనాటికి చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేయాలని పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) చూస్తుంటే ఆయనపై తాజాగా ఓ రూమర్ వైరల్ అవుతోంది. ఆయన రీమేక్స్ అయితే చటుక్కున చేసేసి వెళ్లిపోతారట. ఒరిజినల్ జోలికి మాత్రం అంత త్వరగా వెళ్లరట. ఇదేంటంటే.. స్ట్రాంగ్ కారణాలే చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక చకచకా.. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ (Bheemla Nayak) రీమేక్స్‌ చేసి మాంచి హిట్ కొట్టారు. అయితే భీమ్లా నాయక్ కన్నా ముందే మొదలైన ఒరిజనల్ హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమా షూటింగ్ మాత్రం ఇప్పటికీ పూర్తి చేయలేదు. ఒక పక్క హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్.. (Ustad Bhagathsingh), సముద్ర ఖని (Samuthirakhani)తో తమిళ రీమేక్ షూటింగ్‌ను పవన్ చకచకా కానిచ్చేస్తున్నారు. అంతేనా మేనల్లుడు సాయి తేజ్‌(Sai Dharam Tej)తో కలిసి పవన్ కళ్యాణ్ తమిళనాట హిట్ అయిన వినోదియం సిత్తం చిత్రం రీమేక్ చేస్తున్నారు.

Pawan Kalyan in Ustad Bhagat Singh

వినోదియం సిత్తం ప్రారంభమై దాదాపు 15 రోజులవుతోంది. కానీ షూటింగ్ మాత్రం హై స్పీడులో కొనసాగుతోంది. ఈ రీమేక్ షూటింగ్ పవన్ (Pawan Kalyan) పార్ట్ వచ్చేసి 20 రోజుల్లో పూర్తవుతుందట. అది పూర్తి కాగానే పవన్ వెళ్లి హరిహర వీరమల్లు (Hara Hara Veeramallu) షూటింగ్‌లో పాల్గొంటారట. మొత్తంగా చూస్తే పవన్ రీమేక్స్‌కి ఇచ్చిన ప్రాధాన్యత ఒరిజినల్ మూవీస్‌కి ఇవ్వడం లేదని అర్ధమవుతోంది. ఈ విషయాన్నే ఆయన ఫ్యాన్స్‌లో కొందరు కూడా అంగీకరిస్తున్నారు. ఇదంతా గమనించిన మీదటే.. పవన్ (Pawan Kalyan) రీమేక్స్‌కు ఇచ్చిన ప్రాధాన్యత వేరే చిత్రాలకు ఇవ్వరని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ?

View Results

Loading ... Loading ...
Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!