Anasuya: చంటికి అన్నీ తానై చూసుకుంటున్న అనసూయ.. ఏంటి కథ..!

Anasuya: చంటికి అన్నీ తానై చూసుకుంటున్న అనసూయ.. ఏంటి కథ..!

చలాకీ చంటి(Chalaki Chanti).. వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుని ఆపై బుల్లితెరపై కూడా బాగా ఫేమస్ అయిపోయాడు. నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా ద్వారా మంచి గుర్తింపు సాధించిన చంటి ఆ తరువాత పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించాడు. ఆయన కామెడీ టైమింగ్, మ్యానరిజమ్స్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆయన కామెడీ చాలా నేచురల్‌గా ఉంటుంది.

బిగ్‌బాస్ 6(BiggBoss 6) ద్వారా కూడా ప్రేక్షకులకు చంటి మరింత దగ్గరయ్యాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన చంటి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఆయనకు గుండెపోటు వచ్చినట్టుగా వైద్యులు నిర్ధారించారు. శస్త్ర చికిత్స చేసి స్టంట్ వేశారు. కాగా.. చంటి(Chalaki Chanti)కి గుండెపోటు వచ్చిన విషయాన్ని తెలుసుకుని యాంకర్ అనసూయ(Anchor Anasuya) చాలా కంగారు పడిందట. అందరిలా హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శి వెళ్లకుండా తన వంతు అయినంత సాయం చేస్తోందట.

Anasuya: చంటికి అన్నీ తానై చూసుకుంటున్న అనసూయ.. ఏంటి కథ..!

వైద్యులను చంటి(Chalaki Chanti) ఆరోగ్యంపై ఆరా తీసి.. ఏ అవసరం వచ్చినా కూడా తనకు కాల్ చేయాలని చెప్పిందట. మొత్తానికి అన్నీ తానై చూసుకుంటోందని టాక్. మరి అనసూయకు, చంటి(Chalaki Chanti)కి ఏంటంత అనుబంధం? ఎవరి విషయంలోనూ పెద్దగా కల్పించుకోని అనసూయ.. చంటి విషయంలో మాత్రం ఎందుకంత శ్రద్ధ చూపుతోందనేది చర్చనీయాంశంగా మారింది.

జబర్దస్త్ సమయంలో చంటి, అనసూయ(Anasuya) సొంత అన్నాచెల్లెళ్ల మాదిరిగా ఉండేవారట. అనసూయ(Anchor Anasuya) జబర్దస్త్‌ను వదిలి వెళ్లేటప్పుడు సైతం అందరికంటే ఎక్కువగా బాధ పడింది కూడా చంటీయేనట. వీరిద్దరి మధ్య మంచి ఎమోషనల్ బాండింగ్ ఉందని టాక్.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!