Anchor Suma: ఎన్టీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సుమ..!

Anchor Suma On Ntr

యాంకర్ సుమ (Anchor Suma).. కొన్ని దశాబ్దాలుగా బుల్లితెరను ఏలేస్తుంది. ఎంతో మంది యాంకర్లు వచ్చారు.. పోయారు కానీ సుమ (Suma) మాత్రం పాతుకుపోయారు. కొత్త యాంకర్లు వచ్చినా కూడా ఎవరూ సుమకి సాటిరారనే చెప్పాలి. అసలు సుమ లేకుండా ఏ స్టార్ హీరో సినిమాలకు సంబంధించిన ఈవెంట్ కూడా జరగదంటే అతిశయోక్తి కాదు. అయితే నందమూరి కల్యాణ్ రామ్ (Kalyanram) హీరోగా నటించిన ‘అమిగోస్’ (Amigos) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక ఆసక్తికర ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

‘అమిగోస్’ (Amigos) చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా సుమే యాంకర్. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్‌లో సుమ ఎన్టీఆర్ 30 (NTR30) ప్రస్తావన తీసుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ (NTR) చాలా సీరియస్ లుక్ ఇచ్చాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. దీనిపై సుమ (Anchor Suma) ఇన్నాళ్లకు కౌంటర్ఇచ్చింది. ప్రస్తుతం సుమ హోస్ట్‌గా ఈటీవీలో ‘సుమ అడ్డా’ (Suma Adda) అనే కార్యక్రమం ప్రారంభమైంది.

తాజాగా ‘సుమ అడ్డా’ (Suma Adda) కు అతిథులుగా విక్టరీ వెంకటేష్ (Venkatesh), దగ్గుబాటి రానా (Daggubati Rana) దగ్గుపాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రానా నాయుడు’ (Rana Naidu) వెబ్ సిరీస్ రీసెంట్‌గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. రానా నాయుడు ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ ఈ షోకి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ షోలో భాగంగా వెంకీ (Venkatesh)ని తనను వెబ్ సిరీస్‌లో చూసినట్టు సీరియస్‌గా చూడండి సార్ అని అడిగారు. వెంకీ ఆమె వైపు సీరియస్‌గా చూడటంతో ‘ఇక ఆపేయండి సర్.. దీనిపై యూట్యూబ్‌లో చాలా మీమ్స్ వస్తాయి. ఏంటో ఈమధ్య హీరోలందరూ నాపై సీరియస్ గా చూస్తున్నారు’ అంటూ ఎన్టీఆర్‌ (NTR)కు పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!